Homeజాతీయ వార్తలుGold : బంగారం.. దుబాయ్ లో తక్కువ.. ఇక్కడ ఎక్కువ.. ఎందుకు.. మన ఎంత తెచ్చుకోవచ్చు?

Gold : బంగారం.. దుబాయ్ లో తక్కువ.. ఇక్కడ ఎక్కువ.. ఎందుకు.. మన ఎంత తెచ్చుకోవచ్చు?

Gold : బంగారం అనగానే భారత దేశ మహిళలు(Indian Womens)ఎంతో ఇష్టపడతారు. అయితే ఈ బంగారం ధరలకు రెక్కొలొచ్చాయి. నిత్యం పెరుగుతూనే పోతున్నాయి. పేదల సంగతి అంటుంచి.. మధ్య తరగతికీ అందడం లేదు. దీంతో గిల్టు నగలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇదే బంగారం దుబాయ్‌(Dubai)లో తక్కువ ధరకు దొరుకుతుంది. ఇందుకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

Also Read : ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..పెళ్లయినోళ్లు ఎంత పెట్టుకోవాలి.. ఎక్కువ ఉంటే ఐటీ రైడ్స్ జరుగుతాయా.. ?

పన్నుల రాహిత్యం(Tax Free):
దుబాయ్‌లో బంగారం కొనుగోలుపై స్థానిక పన్నులు లేదా వ్యాట్‌ (VAT) చాలా తక్కువగా ఉంటాయి. భారత్‌లో బంగారంపై 12.5% కస్టమ్స్‌ డ్యూటీ, 3% GST వంటి పన్నులు విధించబడతాయి, ఇవి ధరను పెంచుతాయి. దుబాయ్‌లో ఇలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడం వల్ల ధర తక్కువగా ఉంటుంది.

పెద్ద ఎత్తున వాణిజ్యం:
దుబాయ్‌ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. ‘గోల్డ్‌ సిటీ‘(Gold City)గా పిలవబడుతుంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా బంగారం సరఫరా జరుగుతుంది, దీని వల్ల పోటీ ఎక్కువగా ఉండి ధరలు తగ్గుతాయి.

తక్కువ మేకింగ్‌ ఛార్జీలు(Making Charges):
భారత్‌లో బంగార నగలపై మేకింగ్‌ ఛార్జీలు గ్రాముకు 10–20% వరకు ఉంటాయి, అయితే దుబాయ్‌లో ఇవి చాలా తక్కువగా (5% లేదా అంతకంటే తక్కువ) ఉంటాయి, ఎందుకంటే అక్కడ నగల తయారీలో అధిక యాంత్రీకరణ ఉంటుంది.

స్వచ్ఛమైన బంగారం లభ్యత(Pure Gold):
దుబాయ్‌లో 22K మరియు 24K బంగారం అధికంగా విక్రయించబడుతుంది, ఇది అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఉంటుంది. భారత్‌లో మాత్రం వివిధ స్థానిక కారణాల వల్ల ధరలు పెరుగుతాయి.

భారత్‌కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?
భారత కస్టమ్స్‌ నిబంధనల ప్రకారం దుబాయ్‌ నుంచి బంగారం తెచ్చే పరిమితులు ఇలా ఉన్నాయి.

డ్యూటీ ఫ్రీ పరిమితి:
పురుషులు: 20 గ్రాముల వరకు (సుమారు రూ. 50,000 విలువైనది) డ్యూటీ లేకుండా తెచ్చుకోవచ్చు.
మహిళలు: 40 గ్రాముల వరకు (సుమారు రూ. 1,00,000 విలువైనది) డ్యూటీ లేకుండా తెచ్చుకోవచ్చు. ఈ పరిమితి వర్తించాలంటే, వ్యక్తి కనీసం 6 నెలలు విదేశాల్లో ఉండి ఉండాలి.

గరిష్ఠ పరిమితి: ఒక వ్యక్తి గరిష్ఠంగా 1 కిలో బంగారం తెచ్చుకోవచ్చు, కానీ డ్యూటీ ఫ్రీ పరిమితిని మించిన మొత్తంపై కస్టమ్స్‌ సుంకం చెల్లించాలి.

కస్టమ్స్‌ సుంకం(Custams Duty):
డ్యూటీ ఫ్రీ పరిమితిని దాటితే, మిగిలిన బంగారంపై 12.5% ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ + 1.25% సోషల్‌ వెల్ఫేర్‌ సెస్‌ (మొత్తం 13.75%) చెల్లించాలి. ఉదాహరణకు, 50 గ్రాములు తెచ్చిన మహిళ అయితే, 40 గ్రాములు డ్యూటీ ఫ్రీ, మిగిలిన 10 గ్రాములపై సుంకం చెల్లించాలి.

అవసరమైన పత్రాలు:
బంగారం కొనుగోలు రసీదు, పాస్‌పోర్ట్, మరియు బంగారం వ్యక్తిగత వినియోగం కోసమని నిరూపించే ఆధారాలు చూపించాలి. లేకపోతే అదనపు పన్ను లేదా జప్తు ప్రమాదం ఉంది.

పిల్లలకు: 15 ఏళ్ల లోపు పిల్లలు కూడా 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు, కానీ రుజువులు అవసరం.

జాగ్రత్తలు:
అక్రమ రవాణా (స్మగ్లింగ్‌) చేయడం చట్టవిరుద్ధం, దీనికి భారీ జరిమానాలు లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కస్టమ్స్‌ అధికారులకు డిక్లేర్‌ చేయకుండా ఎక్కువ బంగారం తెస్తే జప్తు చేయబడుతుంది.

Also Read : ఇంకేం కొంటాం బంగారం.. ఆల్ టైం హైని తాకిన గోల్డ్ రేటు.. తులం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Exit mobile version