KL Rahul : బెంగళూరు జట్టుపై ఘనవిజయం సాధించిన తర్వాత కేఎల్ రాహుల్(KL Rahul) తనదైన హావభావాన్ని ప్రదర్శించాడు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన చర్చకు కారణమైంది. విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కేఎల్ రాహుల్ బ్యాట్ తో వేడుకలు జరుపుకున్నాడు. ” ఇది నా మైదానం” అంటూ బ్యాట్ తో విన్యాసాలు ప్రదర్శించాడు. తన చాతి మీద చెయ్యితో తడుముతూ.. విక్టరీ సిగ్నల్స్ ఇచ్చాడు. గట్టిగా అరిచాడు. వాస్తవానికి నిదానంగా ఉండే కేఎల్ రాహుల్ ఆ సమయంలో ఒక్కసారిగా తనలో ఉన్న అసలు సిసలైన రూపాన్ని చూపించాడు. మ్యాచ్ తర్వాత తను అలా ఎందుకు వ్యవహరించానో అనే దానిపై కేఎల్ రాహుల్ క్లారిటీ ఇచ్చాడు” నేను ఇక్కడ చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఈ మైదానం తో నాకు గొప్ప సంబంధం ఉంది. అందువల్లే నేను ఇలా దూకుడుగా ఆడాను.. నా బాధ్యతను నేను నిర్వర్తించాను. నన్ను కొనుగోలు చేసిన జట్టును గెలిపించాను. సొంత మైదానంలో ఇలా చేయడం గొప్పగా ఉంది. సొంత ప్రేక్షకుల మధ్య చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉందని” కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.
Also Read : హేజిల్ వుడ్ కు చుక్కలు.. స్టబ్స్ తో కలిసి మెరుపులు.. కేఎల్ రికార్డులు ఇవి..
అందువల్లేనా
సొంత జట్టుకు వద్దామని భావించినప్పటికీ కె.ఎల్ రాహుల్ కు అది సాధ్యం కాలేదు. అందువల్లే అతడు రివెంజ్ తీర్చుకున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కేఎల్ రాహుల్ 2013 -16 సీజన్ ల వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడాడు. ఆ తర్వాత 2014 -15 కాలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. 2018 -21 కాలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. 2022-24 వరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు అతడు ఆడుతున్నాడు. ఐపీఎల్ కంటే ముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆట తీరు ప్రదర్శించాడు. ఆ తర్వాత అదే జోరును ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు.. వాస్తవానికి ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ కొనుగోలు చేసిన తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతాడని వ్యాఖ్యలు వినిపించాయి. ఢిల్లీ యాజమాన్యం కూడా అదే దిశగా సంకేతాలు ఇచ్చింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లో రాహుల్ బ్యాటింగ్ పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్ పై మరింత ఫోకస్ చేయాలని కేఎల్ రాహుల్ నిర్ణయించుకున్నాడు. అదే అభిప్రాయాన్ని జట్టు మేనేజ్మెంట్ ముందు తెలిపాడు. ఫలితంగా కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక గత మూడు మ్యాచ్లలో కె.ఎల్ రాహుల్ ఏకంగా 185 పరుగులు చేయడం విశేషం. ఇక ఇటీవల పండంటి ఆడబిడ్డకు కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు.
THE KL RAHUL CELEBRATION LAST NIGHT AT THE CHINNASWAMY. pic.twitter.com/RSwa6XfA6g
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2025