Serial Actress : ప్రస్తుత కాలంలో సినిమాల్లో కంటే సీరియల్లో అవకాశాలు రావడమే కష్టంగా మారింది. ఎందుకంటే వందల కొద్ది సీరియళ్లు ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి. వీటిలో నటించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి సీరియల్ లో అవకాశం వస్తే కొన్ని సంవత్సరాల పాటు ఉపాధి పొందవచ్చని అవకాశంతో చాలామంది సినిమాల్లో కంటే సీరియల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు తమ నటనలో విశ్వరూపం చూపించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సీరియల్లో విలన్ పాత్రలో నటించిన వారు బాగా ఫేమస్ అవుతున్నారు. ఇందులో లేడీ విలన్ గెటప్ వేసిన వారి కైతే మహిళల ఫ్యాన్స్ విపరీతంగా ఉంటున్నారు. అలా ఎక్కువమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్న వారిలో రుద్రాణి పాత్ర ఒకటి. ఈ పాత్రలో షర్మిత గౌడ నటించి అందరిని అలరిస్తోంది. కొత్త పాత్రలో నటించిన ఆమె విలనిజం అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆమె ఎలా ఉందంటే?
Also Read : సమంత 2వ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్..వరుడు విషయంలో ఊహించని ట్విస్ట్!
తెలుగులో బ్రహ్మముడి అనే సీరియల్ ఎంత ఫేమస్ సీరియల్ చూసేవారికి తెలుస్తుంది. ఈ ధారావాహికను రోజుకు ఒక్కసారైనా చూడాలని చాలామంది కోరుకుంటారు. ఇందులో నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో షర్మిత గౌడ నటించారు. తెలుగులో బ్రహ్మముడి సీరియల్ ను కన్నడంలో గీత అనే పేరుతో ప్రసారం చేస్తున్నారు
అక్కడ భానుమతి పాత్రలో షర్మిత గౌడ నటించారు.
అయితే సీరియల్లో అత్త పాత్రలో ఎంతో సౌమ్యంగా కనిపించిన షర్మిత రియల్ లైఫ్ లో మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు పోటీ ఇచ్చేందుకు అందంగా తయారవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సీరియల్ లో ఎంతో పెద్ద మనిషిలా కనిపించిన ఈమె రియల్ గా ఆమె డ్రెస్సింగ్, బ్యూటీ నెస్ చూస్తే ఎవరికైనా మతిపోతుందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. లేటెస్ట్ గా ఈమె అప్లోడ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలా డ్రెస్సింగ్ ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు. సీరియల్ లో చూసిన రుద్రానికి.. రియల్ గా కనిపించే రుద్రానికి చాలా తేడా ఉందని అంటున్నారు. అయితే షర్మితకు సోషల్ మీడియా ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. దీంతో ఆమె ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సీరియల్ లోను తనకంటూ గుర్తింపు తెచ్చుకునేలా తనకు ఇచ్చిన పాత్రలో ఒదిగిపోతుంది. విలనిజం పాత్రలో ఎంతో ఆకట్టుకునేలా నటించిన షర్మిత గౌడ ప్రస్తుతానికి మరో సిరియల్ లో కనిపించడం లేదు. అయితే ముందు ముందు అవకాశాలు వస్తే తనదైన శైలిలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈమెకు ఏ పాత్ర ఇచ్చిన అందులో జీవించేస్తుందని కొందరు ఆమె అభిమానులు పేర్కొంటున్నారు. గతంలోనూ షర్మిత గౌడ కుర్ర కారును ఆకట్టుకునే ఫోటోలను అప్లోడ్ చేశారు. వీటిపై కొందరు హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలపై కూడా కామెంట్ల వరద పారుతోంది..
View this post on Instagram