Hanuman Jayanti 2025: రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బజరంగబలి అని పేరు ఉన్న ఆంజనేయ స్వామికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం, శనివారం విశేష పూజలు చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏడాదిలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈసారి హనుమాన్ జయంతి తో పాటు శనీశ్వరుని రోజు అయినా శనివారం రావడంతో ఎంతో ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు పొందవచ్చు అని చెబుతున్నారు. మరి ఈరోజు ఏం చేయాలంటే?
Also Read: మన దేశంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు ఇవే.. చాలా పవర్ ఫుల్
2020 సంవత్సరంలో ఏప్రిల్ 12న చైత్ర పూర్ణిమ తిధి తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు ఉదయం 5.52 గంటలకు ఈ తిధి ముగుస్తుంది. అప్పటివరకు హనుమాన్ జయంతి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.
శని దోషం ఉందని చాలామంది బాధపడుతూ ఉంటారు. తనకు శని పీడ పట్టిందని ఏడేళ్ల వరకు ఉంటుందని కొందరు జ్యోతిష్యాల ద్వారా తెలుసుకుంటారు. అయితే ఇలాంటివారు హనుమాన్ జయంతి రోజున ఈ పనిని చేయాలి. ఈ రోజున హనుమాన్ ఫోటోతో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి.. ఆ చిత్రపటం ఎదురుగా ఆవనూనె తో దీపం వెలిగించాలి.. శనిపీడని పట్టని వారిలో హనుమంతుడు కూడా ఉన్నారు. అందువల్ల ఈరోజున హనుమాన్ ను ఇలా పూజించడం వల్ల శని బాధలు తొలగిపోతాయని అంటున్నారు.
ప్రస్తుత కాలంలో డబ్బు ప్రధానంగా నిలుస్తుంది. కానీ కొందరికి అనుకున్న ఆదాయం రావడం లేదు. అయితే ఉన్నత స్థాయిలో నిలవాలని అనుకునేవారు హనుమాన్ జయంతి రోజున పంచదారను ఇతరులకు దానం చేయాలి. లేదా పంచదారతో చేసిన స్వీట్స్ ను ఇతరులకు పంచిపెట్టాలి. అలాగే పేదలకు అన్నదానం కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కట్టపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు.
సాధారణంగా హనుమాన్ జయంతి సందర్భంగా కొందరు దీక్షలు చేపడతారు. అయితే ఇది వీలు కాని వారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందవచ్చని పేర్కొంటున్నారు. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండడంవల్ల ఎన్నో బాధలు, సంక్షోభావాలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈరోజు ఉపవాసం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల రుణ బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అంటున్నారు. హనుమాన్ జయంతి రోజున ఎక్కడైనా కోతులు కనిపిస్తే వాటికి ఆహారం అందించాలని, అలా చేస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని చెబుతున్నారు.
రాముడికి అత్యంత ఇష్టమైన భక్తుడు హనుమంతుడు. అలాంటి హనుమాన్ జయంతి రోజున రామనామ జపం చేయడం వల్ల కూడా ఆంజనేయస్వామి సంతోషిస్తారని అంటున్నారు. ఈ రోజున జైశ్రీరామ్ అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుందని చెబుతున్నారు. అలాగే ఈరోజు హనుమాన్ ఆలయానికి వెళ్లాల్సి వస్తే తమలపాకుల దండ సమర్పించాలని, అలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి అన్ని శుభాలే జరుగుతాయని చెబుతున్నారు.