RCB Vs DC IPL 2025: ఒక రకంగా ఢిల్లీ జట్టు 4 వికెట్లు నష్టానికి 99 పరుగుల వద్ద ఉంది. అప్పుడు హేజిల్ వుడ్ కు బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ అప్పగించాడు. స్ట్రైకర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. హేజిల్ వుడ్ వేసిన తొలి బంతిని రాహుల్ ఫోర్ కొట్టాడు. రెండవ బంతిని కూడా బౌండరీకి తరలించాడు. ఇక మూడో బంతిని క్విక్ డబుల్ తీశాడు. నాలుగు బంతికి కూడా అదే స్థాయిలో పరుగులు సాధించాడు. ఇక 5వ బంతిని మరోసారి బౌండరీ కొట్టాడు. చివరి బంతిని సిక్సర్ గా మలిచాడు. మొత్తంగా ఆరు బంతుల్లో 22 పరుగులు పిండుకున్నాడు.. ఈ ఓవర్ లో ఢిల్లీ స్కోర్ 121 పరుగులకు చేరుకుంది. కే ఎల్ రాహుల్ వ్యక్తిగత స్కోర్ కూడా 45 బంతుల్లో 73 పరుగులకు చేరుకుంది. ఒకరకంగా ఈ ఓవర్ మ్యాచ్ ను బెంగళూరు జట్టుకు దూరం చేసింది. ఢిల్లీ జట్టు విజేతగా నిలిచేలా చేసింది. ఒకవేళ ఈ ఓవర్ కనుక భువనేశ్వర్ కుమార్ లేదా దయాల్ కు ఇచ్చి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: అక్షర్ బ్రో.. నీది బుర్రా.. పాదరసమా.. RCB ని నేల నాకించావ్ కదా!
ఎన్నో రికార్డులు
ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలవడం ద్వారా ఎన్నో రికార్డులు సొంతమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ లో ఐదవ వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్యాన్ని కేఎల్ రాహుల్, స్టబ్స్ నెలకొల్పారు. వీరిద్దరూ 111* పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించారు. వీరి తర్వాతి స్థానంలో 2014లో బెంగళూరు జట్టుపై షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో జెపి డుమిని, రాస్ టేలర్ 110* పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2024లో విశాఖపట్నం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్, స్టబ్స్ 93 పరుగుల భాగస్వామ్యాన్ని ఐదో వికెట్కో నెలకొల్పారు. 2015లో రాయ్ పూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో కేదార్ జాదవ్, సౌరబ్ తివారి 91 పరుగుల అజేయ భాగస్వామ్య నెలకొల్పారు. 2017లో ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ టెట్ తో జరిగిన మ్యాచ్లో క్రిస్ మోరిస్, కగిసో రబాడ ఐదో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ రన్ చేజర్
ఢిల్లీ జట్టు గెలుపు సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన రన్ చేజర్ గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 25 ఇన్నింగ్స్ లలో 1208 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్. అతడి యావరేజ్ 71.05, స్ట్రైక్ రేట్ 148.58. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 98*. ఇక ఐపీఎల్ చరిత్రలో 56 మంది బ్యాటర్లు చేజింగ్ లో మాస్టర్గా ముద్రపడ్డారు. అయితే వీరంతా కూడా 500 లోపు పరుగులు చేయడం విశేషం. ఇక డేవిడ్ మిల్లర్ మాత్రం ఈ జాబితాలో హైయెస్ట్ యావరేజ్ కొనసాగిస్తున్నాడు. అతడు చేజింగ్లో 1037 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 103.70. కేఎల్ రాహుల్ (93*) ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండవ వ్యక్తిగత అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్వింటన్ డికాక్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 2016 లో జరిగిన మ్యాచ్లో అతడు బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 108 పరుగులు చేశాడు.
Also Read: కేఎల్ రాహుల్ భయ్యా నీకో దండం.. నిజంగా నువ్వు దూతవే..
Rain arrived at the Chinnaswamy before the 15th over – Delhi 8 runs behind.
KL Rahul smashed 4,4,2,2,4,6 – 22 runs Vs Hazlewood. ♂️ pic.twitter.com/s3ZxoaUUeg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2025