KL Rahul- Shreyas Iyer: ఇండియన్ టీం ఒకప్పుడు గెలుపు అంచులకి వచ్చి ఓడిపోయేది.మ్యాచ్ చూసే ప్రేక్షకుడు ప్రతిసారి నిరాశ కి గురి అయ్యాయేవాడు కానీ ఇప్పుడు రోజులు మారాయి అవతల టీం ఎంత స్ట్రాంగ్ గా ఉన్న, మనవాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లేదా ఛేజింగ్ చేసిన గెలుపు అనేది ఇండియన్ టీం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.మనం ఇప్పటి వరకు అన్ని టీముల్లో ఒక ప్లేయర్ బాగా ఆడటం లేదా ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు బాగా ఆడటం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ టీం గెలుపుని సాధించడానికి అందరు కూడా ఒక సెపరేట్ వ్యూహం తో వస్తు ఎవరికీ అవకాశం వస్తే వాళ్ళు ప్రత్యర్థి బౌలర్ల మీద విరుచుకు పడుతున్నారు.
కొద్ది సంవత్సరాలు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా టీం సైతం మనవాళ్ల దూకుడు ను తట్టుకొని నిలబడలేకపోయింది అంటే మన ఇండియన్ ప్లేయర్లు ఏ రేంజ్ లో ఆడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇండియా లో ఆడుతున్న వరల్డ్ కప్ కొట్టడం లో ఇండియన్ టీం కి తిరుగులేదు అనేది పక్క గా తేలిపోయింది…అయితే కొన్ని టీముల్లో ప్లేయర్లు బాగా ఆడలేకపోతే ఎవరి ని తీసుకుందాం అనే డైలమా లో ఆ టీం కెప్టెన్ గాని కోచ్ గాని ఆలోచిస్తూ ఉంటారు.కానీ మన టీం లో మాత్రం దానికి రివర్స్ లో జరుగుతుంది ఉన్న ప్లేయర్లు అందరు కూడా బాగానే ఆడటం తో ఎవరిని ప్లేయింగ్ 11 లోకి తీసుకోవాలి అనే విషయం మీద కెప్టెన్ రోహిత్ శర్మ గాని, కోచ్ రాహుల్ ద్రావిడ్ గాని అర్థం కాకా తలలు పట్టుకుంటున్నారు… అయితే ముఖ్యం గా ఇక్కడ అన్ని స్లాట్ లలో ఆడటానికి అందరు ప్లేయర్లు సెట్ అయ్యారు, కానీ ఒక్క నెంబర్ ఫోర్ కోసం మాత్రం ముఖ్యం గా ఇద్దరు ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది.వాళ్లిద్దరూ ఎవరంటే ఒకరు కె ఎల్ రాహుల్ కాగా, ఇంకొకరు శ్రేయాస్ అయ్యర్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ప్లేయింగ్ 11 లో ఉంటే బెస్ట్ అనేది మనం ఒకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మొదట గా కె ఎల్ రాహుల్ గురించి చూసుకుంటే రాహుల్ వికెట్ కీపర్ గా చేస్తాడు, అలాగే నెంబర్ ఫోర్ లో అయిన నెంబర్ ఫైవ్ లో అయిన చాలా బాగా ఆడుతాడు.ఇంకా కావాలంటే తను ఓపెనర్ గా అయినా ఆడుతాడు.అయితే రాహుల్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆయన మ్యాచ్ పొజిషన్ ని బట్టి హిట్టింగ్ అయినా చేస్తాడు,లేదా వికెట్లు పోకుండా ఒక పెద్ద ఇన్నింగ్స్ అయినా నిర్మిస్తాడు, కానీ రాహుల్ చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకున్నాక కూడా ఇప్పటికి తాను మంచి ఫామ్ లో ఉన్నాడు ఆయన ఫామ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏషియా కప్ లో గాని, ఆస్ట్రేలియా సిరీస్ గాని చూస్తే మనకు అర్థం అయిపోతుంది ఆయన ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది…
అయితే రాహుల్ దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన స్పిన్నర్లు ని అయినా ఫాస్ట్ బౌలర్లని అయినా సమానంగా ఆడుతాడు.వాళ్ళని ఉతికి ఆరేయడం లో రాహుల్ సిద్ధహస్తుడు…ఈయన టీం లో ఉంటే టీం కి అడ్వాంటేజ్ ఏంటంటే టీం ఒక భారీ స్కోర్ చేయడం లో చాలా వరకు రాహుల్ హెల్ప్ చేస్తాడు.ఈయన ఉంటె మిడిలాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.ఇక ఈయన లో ఉన్న మైనస్ ఏంటంటే ఒకసారి కనక ఆయన ఒక మ్యాచ్ లో కానీ లనక్ట్ అవ్వకపోతే మాత్రం ఇక వరుసగా అదే మ్యాచులు అన్ని కూడా ఫెయిల్ అవుతూ వస్తాడు.అలాగే తొందరగా గాయాలకు గురి అవుతూ ఉంటాడు…
ఇక ఒకసారి శ్రేయాస్ అయ్యారు గురించి చూసుకుంటే రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి తను ఒక లాంగ్ అండ్ హై లెవల్ ఇన్నింగ్స్ ఆడితే ఎలా ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ చేసాడు…ఈయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా నీట్ గా ఒక ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు.ఆయన పొటెన్షియాల్టి ఏంటి అనేది అతనికి తెలుసు.కాబట్టి దాని ప్రకారమే ఆ పరిధి మేరకే సెలెక్టెడ్ గా షాట్స్ మాత్రమే ఆడుతూ ఒక భారీ ఇన్నింగ్స్ ని అయితే నెలకొల్పుతాడు,అలాగే టీం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా బాగా ఆడుతాడు. ముఖ్యంగా ట్రిక్కి పిచ్ మీద బాగా ఆడుతాడు, ట్రిక్కీ పిచ్ అంటే ఏంటంటే ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఇద్దరికి అనుకులిస్తూనే అది బ్యాటింగ్ కి కూడా కొంత వరకు సంహరిస్తుంది అలాంటి పిచ్ లపైనా మిడిలాడర్ లో ఉన్న ప్లేయర్ బాగా ఆడటం అంటే మాములు విషయం కాదు.
ఎందుకంటే స్పిన్నర్స్ వేసే బాల్స్ ని తట్టుకొని నిలబడటం చాలా కష్టం కానీ అయ్యర్ అలాంటి పిచ్ ల మీద చాలా బాగా ఆడుతాడు… అయితే అయ్యర్ పాస్ట్ బౌలర్లని , స్పిన్ బౌలర్లని ఇద్దరిని బాగా ఆడుతాడు కానీ కొన్ని సందర్భాల్లో స్పిన్నర్స్ ని ఎదురుకోవడం లో ఇబ్బంది కూడా పడతాడు. ముఖ్యంగా అయ్యర్ బౌన్స్ పిచ్ లపైనా కొంచం ఇబ్బంది పడుతాడు. కానీ వరల్డ్ కప్ ఆడేది ఇండియాలోనే కాబట్టి మన దగ్గర అంత నార్మల్ పిచ్ లే, బౌన్స్ పిచ్ లు ఏం లేవు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ప్రెజర్ ని కంట్రోల్ చేయడం లో కూడా కొంతవరకు ఒకే కానీ పూర్తి గా అతను దాన్ని కంట్రోల్ చేయలేడు…
ఇక ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ప్రస్తుతం ఉన్న ఫామ్ లో ఇద్దరు కూడా బెస్ట్ ప్లేయర్స్ అనే చెప్పాలి.ఇక ఇద్దరిలో ఒకరిని మాత్రమే తీసుకోవాలి కాబట్టి కె ఎల్ రాహుల్ ని వరల్డ్ కప్ లో తీసుకునే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. అయితే అయ్యర్ ని బెంచ్ కే పరిమితం చేస్తారా ఆటే అది కూడా ఖాచ్ఛితం గా చెప్పలేం… ఎందుకంటే రాహుల్ ని పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టీం లా మీద తీసుకుంటే బెటర్ ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లో రాహుల్ బాగా ఆడుతాడు.అలాగే అయ్యర్ ని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీంల మీద తీసుకోవాలి.అలా కాదు ప్రతి సారి ప్లేయర్లని మార్చలేం అలా మార్చితే వాళ్ళు ఫామ్ ని కోల్పోయే ప్రమాదం ఉంది అంటే మాత్రం అన్ని మ్యాచులకి రాహుల్ ని తీసుకోవడమే బెటర్…
రాహుల్ ని తీసుకోవడం ఎందుకు బెటర్ అంటే ఆయన అయ్యార్ కంటే కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు.అలాగే ప్రెజర్ ని బాగా కంట్రోల్ చేస్తూ గేమ్ ఆడుతాడు,ఇంకా అయ్యర్ కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన అనుభవం కూడా రాహుల్ కి ఉంది కాబట్టి వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీ ఆడినప్పుడు అనుభవం కూడా కొన్ని సార్లు కీలక పాత్ర వహిస్తుంది అందుకే రాహుల్ ని తీసుకోవడమే బెటర్…