KKR vs SRH : ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో హైదరాబాద్, కోల్ కతా తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది..కోల్ కతా బౌలర్ మిచెల్ స్టార్క్ దూకుడుకు హైదరాబాద్ జట్టు వణికిపోయింది. ప్రమాదకరమైన హెడ్, షాబాద్ అహ్మద్ పరుగులేమీ చేయకుండానే స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. అభిషేక్ శర్మను వైభవ్ అరోరా వెనక్కి పంపించాడు. రాహుల్ త్రిపాఠి 55, క్లాసెన్ 32 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ.. దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో వారిద్దరూ అవుట్ కావడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. చివరికి స్టార్ హీరోయిన్ తెలుగులో కామెంట్రీ చేసి, ఉత్సాహపరిచినప్పటికీ, హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకోలేదు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెరిసింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ బాక్స్ లోకి ఆమె ముఖ్యఅతిథిగా వచ్చింది. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంది.. ” ఖాళీ సమయం దొరికితే నేను క్రికెట్ మ్యాచ్ లు చూస్తాను. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ఆటగాళ్లు..సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అంటే ఇష్టమని” కాజల్ అగర్వాల్ పేర్కొంది. అయితే ఆమె నితీష్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావిస్తుండగానే.. అతడు క్యాచ్ అవుట్ కావడం విశేషం. కాజల్ అగర్వాల్ ఇటీవల సత్యభామ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తెలుగు కామెంట్రీ బాక్స్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా తన సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంది. వాటితో పాటు తన క్రికెట్ వ్యాఖ్యానంతో అభిమానులను అలరించింది. కాజల్ ఉత్తరాది ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. తెలుగులో ఆకట్టుకునే విధంగా మాట్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది.
కీలకమైన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పై అభిమానులకు ఎన్నో అంచనాలు ఉండగా.. వాటిని చేరుకోవడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ సీజన్లో సరికొత్త రికార్డులను సృష్టించిన హైదరాబాద్ ఆటగాళ్లు..ప్లే ఆఫ్ మ్యాచ్లో లో కోల్ కతా పై చేతులెత్తేశారు. ముఖ్యంగా స్టార్క్ బౌలింగ్ కు దాసోహం అయ్యారు. 270+ పరుగులను అవలీలగా కొట్టేసిన హైదరాబాద్ ఆటగాళ్లు.. 150 పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఇదే మైదానంపై గుజరాత్ జట్టుతో లీగ్ మ్యాచ్ జరగగా.. అప్పుడు హైదరాబాద్ ఆటగాళ్లు 160 కి పైగా పరుగులు చేశారు. కానీ ఇప్పుడు ఆ స్కోరును కూడా దాట లేకపోవడం సరి కదా.. దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.
Kajal Aggarwal said, "Virat Kohli and MS Dhoni are my favourite cricketers". (Star Sports). pic.twitter.com/5S8CxenVuB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2024