Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు..

2024 మే 22 బుధవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి, విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 22, 2024 7:45 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 మే 22 బుధవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి, విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. మరో రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
కొన్ని పనుల కారణంగా ఈ రాశి వారు బిజీగా ఉంటారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారుప కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు.

వృషభ రాశి:
ఉద్యోగులు కార్యాలయంలో బిజీ వాతావరణంలో ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులు పెుతారు.

మిథున రాశి:
ఇంటికి అతిథుల రాకతో సందడిగా మారుతుంది. ఏ పని కోసమైనా ఎక్కువగా ఆలోచించవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమస్యలను పరిష్కరించుకుంటారు.

కర్కాటక రాశి:
ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా బాగుంటుంది.

సింహారాశి:
కొన్ని విషయాలో ఆకస్మికంగా డబ్బు రావొచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:
వ్యాపారులు ప్రశాంతంగా ఉంటారు. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు.

తుల రాశి:
ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి:
ప్రణళికలన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది.

ధనస్సు రాశి:
పెండింగు పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం విషయంలో కేర్ తీసుకోవాలి.

మకర రాశి:
వ్యాపారులు తమ పనిపై దృష్టి పెట్టారు. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహంగా ఉంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ప్రియమైన వారికి బహుమతిని ఇస్తారు.

కుంభరాశి:
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతీ పనిలో విజయం సాధించేందుకు కృషి చేయాలి. సాంకేతిక సహాయంతో కొత్త పనిని ప్రారంభిస్తారు.

మీనరాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పని చేసినా ఏకాగ్రత పెట్టడం మంచిది. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి.