Altroz car : టాటా కంపెనీకి చెందిన ఇప్పటికే చాలా మోడళ్లు వినియోగదారులను ఆకర్షించాయి. లేటేస్ట్ గా టాటా కంపెనీ నుంచి ఆల్ట్రోజ్ రేసర్ త్వరలో రిలీజ్ రిలీజ్ కాబోతుంది. దీనిని ఇటీవలే టెస్ట్ చేశారు. అయితే ఇంకా విడుదలకు సమయం ఉన్నా.. అప్పుడే ఈ మోడల్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ కారును చూసిన ప్రతి ఒక్కరూ ఇంప్రస్అవుతున్నారు. ఇంతకీ ఆ కారు ఎలా ఉందంటే.
కొత్త ఆల్ట్రో రేజర్ డిజైన్ అయితే అద్భుతంగా ఉందని అనిపిస్తుంది. ఇందులో బ్లాక్ డ్యూయెల్ టోన్ ను అమర్చినట్లు తెలుస్తోంది. బానెట్ పై ట్విన్ వైట్ స్ట్రిప్స్, ఫ్రంట్ గ్రిల్ వంటివి ఉన్నాయి. ఇందులో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ కూడా అమర్చినట్లు తెలుస్తోంది. ఫ్రంట్ వెంటిలేటేడ్ సీట్లు కూడా ఆకర్షించనున్నాయి. ఇప్పటికే దీనిని భారత్ మొబలిటీ ఎక్స్ పో లో ప్రదర్శించారు. దాని ప్రకారం చూస్తే ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రీ డిజైన్ చేసిన ఇనుస్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.
టాటా అల్ట్రోజ్ రేసర్ ఇంజిన్ విషయానికొస్తే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 118 బీహెచ్ పీ పవర్ తో పాటు 170 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉండే అవకాశం ఉంది. టాటా అల్ట్రోజ్ మార్కెట్లోకి వచ్చిన తరువాత హ్యుందాయ్ ఐ20 ఎన్ కు గట్టి పోటీ ఇవ్వనుందని అంటున్నారు. అల్ట్రోజ్ ధర రూ.9.40 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది.