KKR vs SRH : మరో కొద్ది గంటల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్ లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలలో ఈ రెండు జట్లు పటిష్టంగా ఉన్నాయి. ఫలితంగా అభిమానులకు వీనుల విందైన క్రికెట్ వినోదం లభించడం ఖాయం.. అయితే ప్లే ఆఫ్ లో కోల్ కతా జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది..కోల్ కతా ఆటగాళ్లు ప్లే ఆఫ్ సమయంలో ఆకాశమేహద్దుగా చెలరేగిపోతారు. దుర్గాదేవి పూనినట్టు పూనకంతో ఊగిపోతారు. ప్రత్యర్థి ఆటగాళ్లకు దడ పుట్టిస్తారు.
ప్రస్తుత ఐపీఎల్ లో లీగ్ దశలో కోల్ కతా పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 2021 తర్వాత కోల్ కతా మొదటిసారి ప్లే ఆఫ్ కి వెళ్ళింది.. ఈ 17 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో కోల్ కతా జట్టు పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో నిలవడం ఇదే మొదటిసారి..ప్లే ఆఫ్ కు అర్హత సాధించడం ఇది ఎనిమిదవ సారి. 2021లో కోల్ కతా చెన్నై జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో కోల్ కతా ఓటమి పాలైంది. ఈ సీజన్లో కోల్ కతా +1.428 నెట్ రన్ రేట్ తో లీగ్ దశను ముగించింది.. ఏ సీజన్లోనైనా ఈ నెట్ రన్ రేటే అధికం.. ఈ విషయంలో కోల్ కతా కొత్త రికార్డు సృష్టించింది.
ప్లే ఆఫ్ లో కోల్ కతా జట్టు తరఫున గిల్ అత్యధిక పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడు గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2018 నుంచి 2021 వరకు అతడు కోల్ కతా జట్టుకు ఆడాడు..5 ప్లే ఆఫ్ మ్యాచ్ లలో ఆడిన అతడు 127 స్ట్రైక్ రేట్ తో 184 రన్స్ చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 51 పరుగులు. గిల్ తర్వాత మనీష్ పాండే కోల్ కతా జట్టు తరఫున అత్యధికంగా పరుగులు చేశాడు . అతడు మూడు మ్యాచ్లలో 154 స్ట్రైక్ రేట్ తో 151 రన్స్ చేశాడు. ఇందులో అతడి అత్యుత్తమ స్కోరు 94. కోల్ కతా జట్టు తరఫున సునీల్ నరైన్ ఎక్కువ వికెట్లు తీశాడు. 2012 నుంచి 2021 వరకు అతడు మొత్తం 12 మ్యాచ్లు ఆడగా.. మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. 21/4 అతడి అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు పీయూష్ చావ్లా కూడా ఆరు మ్యాచ్లలో 9 వికెట్లు నేల కూల్చాడు.