https://oktelugu.com/

Sudigali Sudheer : నీ కరువు పాడుగాను, ఆడ దెయ్యాన్ని కూడా వదలవా… సుడిగాలి సుధీర్ ఇంత గాలోడా!

కాగా ఈ ఎపిసోడ్ మే 24న ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక త్వరలో సుధీర్ ఈటీవీలో ఓ సరికొత్త షో తో బుల్లితెర పై ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రోమో కూడా వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 06:31 PM IST
    Follow us on

    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ యాంకర్ గా కూడా చేస్తున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో సర్కార్ సీజన్ 4 హోస్ట్ చేస్తున్నాడు. గతంలో ప్రదీప్ మాచిరాజు సర్కార్ గేమ్ షో హోస్టుగా ఉండేవాడు. సుధీర్ యాంకర్ గా సీజన్ 4 మంచి ఆదరణ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన నాలుగు ఎపిసోడ్స్ కి చెప్పుకోదగ్గ రెస్పాన్స్ వచ్చింది. తన మార్క్ కామెడీతో సుధీర్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాగా తాజా ఎపిసోడ్ లో ‘ లవ్ మీ ‘ మూవీ టీం సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

    సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకున్న మల్టీ టాలెంట్స్ తో అశేష ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. వెండితెరపై హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. అటు సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్ గా కూడా రాణిస్తున్నాడు. ఇక సర్కార్ సీజన్ 4 కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఎంటర్టైనింగ్ గా ఉంది. లవ్ మీ టీం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా షో కి విచ్చేశారు.

    హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి గెస్టులుగా వచ్చారు. ఇక అమ్మాయిలతో సుధీర్ పులిహోర కలపడంలో ఎక్సపర్ట్ అన్న విషయం తెలిసిందే. వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి ఎంట్రీ ఇవ్వడంతో వాళ్ళతో కలిసి స్టెప్పులు వేశాడు. మీ సినిమా పేరు ఏంటని అడిగి .. వాళ్ళతో లవ్ మీ అని చెప్పించుకున్నాడు. అందంగా పుట్టడం నా తప్పా అంటూ తెగ మెలికలు తిరిగిపోయాడు.

    ఇక సినిమాలో దెయ్యం తో ప్రేమ అనగానే… అయినా కూడా నాకు ఒకే అంటూ షాక్ ఇచ్చాడు. సర్ .. దెయ్యాన్ని ఈ నైట్ కి రమ్మనండి అంటూ నవ్వించాడు. ఆ తర్వాత రవి కృష్ణ సుధీర్ మధ్య జరిగిన సంభాషణలు హైలెట్ గా నిలిచాయి. వాళ్ళిద్దరి మధ్య కామెడీ హిలేరియస్ గా ఉంది. కాగా ఈ ఎపిసోడ్ మే 24న ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక త్వరలో సుధీర్ ఈటీవీలో ఓ సరికొత్త షో తో బుల్లితెర పై ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రోమో కూడా వచ్చింది.