https://oktelugu.com/

IPL 2025 : ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ విన్నర్స్ వీరే..

IPL 2025 : మరికొద్ది గంటల్లో కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 18వ ఎడిషన్ (IPL 18th edition) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) పోటీ పడతాయి.

Written By: , Updated On : March 22, 2025 / 03:15 PM IST
Purple Cap winners in the IPL

Purple Cap winners in the IPL

Follow us on

IPL 2025 : తొలి మ్యాచ్ కోసం బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. బాలీవుడ్ నటీమణులు దిశా పటానీ, శ్రద్ధా కపూర్, కరీనాకపూర్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. బాలీవుడ్ సింగర్ శ్రేయ ఘోషల్ తన గాత్ర మాధుర్యంతో అలరించనుంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, చావా ఫేం విక్కీ కౌశల్, మున్నాభాయ్ సంజయ్ దత్ వంటి వారు ఆరంభ వేడుకల్లో మెరవనున్నారు. వీరందరికీ బీసీసీఐ భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఐపీఎల్ అంటేనే అదిరిపోయే ఆట తీరుకు చిరునామా. అయితే అలాంటి ఐపీఎల్లో బ్యాటర్లకు మాత్రమే కాదు.. బౌలర్లకు కూడా పండగే. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లకు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఆరెంజ్ క్యాప్ అందిస్తుంది. వికెట్లు పడగొట్టిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ బహుకరిస్తుంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ 17 ఎడిషన్లు పూర్తిచేసుకుంది. ఈ 17 ఎడిషన్లలో పర్పుల్ క్యాప్ లు సొంతం చేసుకున్న బౌలర్ జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

Also Read : ఐపీఎల్ లో ఇప్పటివరకు వీళ్ళే టాప్!

పర్పుల్ క్యాప్ విజేతలు వీర

ఐపీఎల్ 2008 (ప్రారంభ ఎడిషన్లో) లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన సో హైల్ తన్వీర్ 11 మ్యాచ్లలో 22 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2009 ఐపిఎల్ ఎడిషన్లో దక్కన్ చార్జర్స్ తరఫున ఆర్పి సింగ్ 16 మ్యాచ్లలో 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ 2010 ఎడిషన్ లో దక్కన్ చార్జర్స్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా 16 మ్యాచ్లలో 21 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.

2011 ఐపిఎల్ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ 16 మ్యాచ్లలో 28 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2012 ఎడిషన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ మోర్ని మోర్కెల్ 16 మ్యాచ్లలో 25 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2013 ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బ్రావో 18 మ్యాచ్లలో 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

ఐపీఎల్ 2014 ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ 16 మ్యాచ్లలో 23 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2015 ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వెన్ బ్రావో 17 మ్యాచ్లలో 26 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2016 ఎడిషన్లో హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 17 మ్యాచ్ లలో 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2017 ఎడిషన్లో హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 14 మ్యాచ్లలో 26 వికెట్లు పడగొట్టాడు.. పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2018 ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆండ్రూ టై 14 మ్యాచ్లలో 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ 2019 ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 17 మ్యాచ్లలో 26 వికెట్లు సాధించాడు. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2020 ఐపిఎల్ ఎడిషన్ లో పంజాబ్ జట్టు బౌలర్ కగిసోర్ రబాడ 17 మ్యాచ్లలో 30 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2021 ఎడిషన్ లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ 15 మ్యాచ్లలో 32 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు

ఐపీఎల్ 2022 ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ 17 మ్యాచ్లలో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2023 ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షమీ 17 మ్యాచ్ లలో 28 వికెట్లు సాధించాడు. తద్వారా పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2024 ఎడిషన్ లో పంజాబ్ జట్టు బౌలర్ హర్షల్ పటేల్ 14 మ్యాచ్లలో 24 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

Also Read : దిశా పటానీ, శ్రేయా ఘోషల్ కు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్!