IPL trophy 2025
IPL Trophy 2025 : 18వ ఎడిషన్ మార్చి 22 న మొదలై మే 25న పూర్తవుతుంది. 74 మ్యాచ్లను ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్వహిస్తుంది.. ఇక ఈసారి చాలామంది ఆటగాళ్లు వేరే జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు.. ఈ సీజన్లో బంతికి ఉమ్మి రాయడం పై ఉన్న నిషేధాన్ని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఎత్తివేసింది. మంచు ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అంపైర్ల సహకారంతో బాల్ చేంజ్ చేసే అవకాశాన్ని కూడా బౌలర్లకు నిర్వాహ కమిటీ కల్పించింది. ఎత్తుగా వేసే, ఆఫ్ స్టంప్ అవతల వేసే వైడ్ లను నిర్ణయించడానికి డీఆర్ఎస్ విధానాన్ని ఐపీఎల్ నిర్వాహ కమిటీ అమలు చేయనుంది.
Also Read : మూడు ముక్కల్లో ఐపీఎల్ గురించి కెప్టెన్లు చెప్పేశారు!
అతడికి ఇదే చివరిదా..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోని కి ప్రస్తుతం 43 సంవత్సరాలు. ఇతడు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై ఐదు సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ అతడికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోని వండడం చెన్నై జట్టుకు కొండంత బలంగా మారింది. అయితే ధోని ఈ సీజన్ తోనే ఐపీఎల్ కు శుభం కార్డు వేయవచ్చని తెలుస్తోంది.
రో – కో రంగంలోకి దిగుతున్నారు
గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు టీం ఇండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ, కీలక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ టి20 క్రికెట్ ఆడుతున్నారు. గత సీజన్లో విరాట్ కోహ్లీ 741 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రోహిత్ మాత్రం ఆశించినంత స్థాయిలో ఆడ లేకపోయాడు. అయితే ఈసారి రోహిత్ నుంచి ముంబై జట్టు బలమైన ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మరోవైపు రోహిత్ కు కూడా ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
లక్నో జట్టు తరఫున అతడు..
గత ఏడాది నిర్వహించిన మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడు పోలేదు. దీంతో అతడు లక్నో జట్టు తరుపున రంగంలోకి దిగుతున్నాడు. లక్నో జట్టు పేస్ బౌలర్ మొహిసిన్ ఖాన్ స్థానంలో అతడిని తీసుకున్నట్టు తెలుస్తోంది.. లక్నో జట్టు శార్దుల్ పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఇక గత ఏడాది జరిగిన మెగా వేలంలో చెన్నై జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. అయితే దేశవాళి టోర్నీలలో శార్దూల్ తన అద్భుతమైన ఆట పేరుతో అదరగొట్టాడు.
కెప్టెన్ల మార్పు
ఈసారి చెన్నై, ముంబై, రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్ మినహా.. మిగతా అన్ని జట్ల కెప్టెన్లు మారారు. బెంగళూరుకు రజత్ పాటిధార్, కోల్ కతా కు అజింక్యా రహానే, లక్నోకు రిషబ్ పంత్, ఢిల్లీకి అక్షర్ పటేల్, పంజాబ్ కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక ప్రారంభ మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్, ముంబై ఇండియన్స్ కు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. కొత్త కెప్టెన్లు తమ జట్లకు మెరుగైన విజయాలు అందించి.. విజేతలుగా నిలపాలని పట్టుదలతో ఉన్నారు.
Also Read : ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ విన్నర్స్ వీరే..