https://oktelugu.com/

KKR Vs RCB: విరాట్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు.. వైరల్ వీడియో

KKR Vs RCB ఐపీఎల్ 2025 సీజన్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన విజయంతో మొదలుపెట్టింది. శనివారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Written By: , Updated On : March 23, 2025 / 11:34 AM IST
KKR Vs RCB (3)

KKR Vs RCB (3)

Follow us on

KKR Vs RCB: బెంగళూరు ఓపెనర్లు సాల్ట్(salt), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో బెంగళూరు జట్టు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని సులువుగానే చేదించింది. సాల్ట్, కోహ్లీ ద్వయం విధ్వంసానికి సరికొత్త అర్ధాన్ని చెప్పింది. వీరిద్దరిని పెవీలియన్ పంపించేందుకు కోల్ కతా కెప్టెన్ అజింక్యా రహానే చేయని ప్రయత్నం అంటూ లేదు.. బెంగళూరు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లోని వరుణ్ చక్రవర్తిని రహానే రంగంలోకి దింపాడు అంటే కోహ్లీ, సాల్ట్ ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు 36 సంవత్సరాలు అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి.. కోహ్లీ వీర విహారం చేశాడు. సంచలన షాట్లు కొడుతూ ఈడెన్ గార్డెన్స్ ను ఉర్రూతలూగించాడు.. 36 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ ల సహాయంతో 59* పరుగులు చేశాడు. ఇందులో అతడు 4 స్లాగ్ స్వీప్ షాట్లు ఆడడం విశేషం… సాధారణంగా ఇలాంటి షాట్లను పేస్ బౌలర్ల పై ప్రయోగిస్తుంటారు. కానీ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పై ప్రయోగించాడు. ఈ షాట్ల వల్లే విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులు చేశాడు.

Also Read: మైదానంలో కోహ్లీ కోసం ఈ ఫ్యాన్ చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్

అవే ప్రధాన అస్త్రంగా మారాయి..

విరాట్ కోహ్లీ ఆడిన సెన్సేషనల్ షాట్లు అతడికి వరంగా మారాయని టీమిండియా మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్ వ్యాఖ్యానించారు. “స్పిన్నర్లు కోల్ కతా జట్టుకు ప్రధాన బలం. కానీ ఆ బలాన్ని విరాట్ కోహ్లీ నేల నాకించాడు.. భీకరమైన షాట్లు పక్కనపెట్టి.. తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేశాడు. స్పిన్ బౌలింగ్ లో తన దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. స్పిన్ బౌలింగ్ లోను విరాట్ అద్భుతంగా ఆడాడు. స్లాగ్ స్వీప్ షాట్లు ఆడి అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని రహానే కూడా ఊహించి ఉండడు. నాలుగో ఓవర్ లోనే వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. విరాట్ కోహ్లీ ఆడిన ఆట తీరు గొప్ప గొప్ప స్పిన్ బౌలర్లకు కూడా ఇబ్బందికరంగా మారింది. కాగా, విరాట్ కోహ్లీ కోల్ కతా జట్టుపై చేసిన హాఫ్ సెంచరీ ద్వారా సరికొత్త రికార్డు సృష్టించాడు. నాలుగు జట్లపై వేయికి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్ కతా జట్టుపై 1000 పరుగుల మార్గ సాధించిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. కోల్ కతా కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ 11 పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై అతడు 1000కి పైగా పరుగులు చేశాడు. బెంగళూరు జట్టు తన తర్వాతి మ్యాచ్ చెన్నైతో చెన్నై వేదికగా ఆడనుంది.