Nicholas Pooran : ఈ మ్యాచ్లో ఓపెనర్ మార్ష్(Marsh)(81: 48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) తన ప్రతాపాన్ని చూపిస్తే.. నికోలస్ పూరన్(Nicholas pooran)(87*: 36 బంతుల్లో ఏడు ఫోర్లు, 8 సిక్సర్లు) పెను విధ్వంసాన్ని సృష్టించాడు. ఫలితంగా జట్టు మూడు వికెట్ నష్టానికి 238 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో 87 పరుగులు చేయడం ద్వారా నికోలస్ పూరన్(Nicholas pooran) సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ లో బంతుల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అండ్రి రస్సెల్ 1120 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. నికోలస్ పూరన్(Nicholas pooran) 1,198 బంతుల్లో 2000 రన్స్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 1,211 బంతుల్లో 2000 పరుగుల మార్క్ అందుకున్నాడు. క్రిస్ గేల్ 1,251 బంతుల్లో 2000 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 1,306 బంతుల్లో 2000 పరుగులు చేశాడు..మాక్స్ వెల్ 1,309 బంతుల్లో 2000 రన్స్ చేశాడు. మంగళవారం నాటి మ్యాచ్ లో నికోలస్ పూరన్(Nicholas pooran) 36 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఇందులో 7ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ టీజర్ వచ్చేసింది..ఈసారి మిస్ అయ్యేలా లేదు!
మరో ఘనత కూడా
నికోలస్ పూరన్(Nicholas pooran) గడిచిన 8 ఐపిఎల్ ఇన్నింగ్స్ లలో ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా అన్నింటిలో బీభత్సంగా పరుగులు చేశాడు. 48*(26), 61(27), 75(29), 75(30), 70(26), 44(30), 12(6), 87*(36) గడిచిన 8 ఇన్నింగ్స్ లలో నికోలస్ చేసిన పరుగులు అవి. దీనినిబట్టి అతడు ఏ స్థాయిలో ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మార్ష్ విధ్వంసం సృష్టించాడు అనుకుంటే..నికోలస్ పూరన్(Nicholas pooran) మరింత బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఏ ఒక్క కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ ను వదిలిపెట్టలేదు. వైభవ్ ఆరోరా నుంచి మొదలుపెడితే వరుణ్ చక్రవర్తి వరకు అందరి మీద దూకుడు ప్రదర్శించాడు. అందువల్లే లక్నో జట్టు పరుగుల వరద పారించింది.
పిచ్ సహకరించింది
అంతకుముందు ఈ పిచ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఆడాయి. అయితే ఈ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు అదరగొట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. కానీ ఈ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా తేలిపోయారు. వాస్తవానికి టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ రహానే పిచ్ పరిస్థితి తెలిసి కూడా ఫీల్డింగ్ ఎంచుకోవడం.. లక్నో జట్టుకు వరంగా మారింది. ఈ మైదానం మీద అంతగా స్కోర్ చేయడం అంటే మాటలు కాదు. కోల్ కతా బౌలర్ల పై ఎదురుదాడికి దిగి లక్నో బ్యాటర్లు పై చేయి సాధించారు. వారి దూకుడు వల్లే లక్నో జట్టు అంతలా స్కోర్ చేయగలిగింది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కూడా దూకుడుగానే బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. లక్నో జట్టు తొలి వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
also Read : మార్ష్ ఊర మాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్ బద్దలైపోయిందిగా..