spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Wife Sangeetha Files For Divorce: తమిళ హీరో విజయ్ తో విడాకులు కోసం...

Vijay Wife Sangeetha Files For Divorce: తమిళ హీరో విజయ్ తో విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగీత..వీడియో వైరల్!

Vijay Wife Sangeetha Files For Divorce: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉండేవి. ఆయన ప్రముఖ హీరోయిన్ త్రిష తో డేటింగ్ చేస్తున్నాడని, చాలా కాలం నుండి ఆయన తన భార్య సంగీత తో దూరం గా ఉంటున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని చాలా మంచి కొట్టిపారేశారు. అయితే నేడు విజయ్ సతీమణి సంగీత చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో తనకు విజయ్ నుండి విడాకులు కావాలంటూ పిటీషన్ దాఖలు చేయడం ఇప్పుడు సంచలనం గా మారింది. విజయ్ ఒక పాపులర్ తమిళ హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని , ఆ కారణం చేతనే తనకు విడాకులు కావాలంటూ ఆమె పిటీషన్ లో పేర్కొంది.

ఇది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు కేవలం రూమర్స్ అని అనుకుంటూ వస్తున్న ఈ వార్తలు నిజమే అనే విషయం తెలియగానే విజయ్ ఫ్యాన్స్ కూడా కంగుతిన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం , ప్రేమించడం వంటివి సాధారణమే , అందులో ఎలాంటి తప్పు లేదు, కానీ ఒక భార్య ఉండగానే, మరొకరితో సంబంధం పెట్టుకోవడం ముమ్మాటికీ తప్పే. విజయ్ కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, ఆయన ఒక రాజకీయ పార్టీ కి అధినేత కూడా . అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ఏంటో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి , ఇలాంటి సమయం లో ఇలా ఆయన భార్య బయటకు రావడం విజయ్ పొలిటికల్ కెరీర్ కి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు . ఆమె వేసిన పిటీషన్ లో కొన్ని సంచలన విషయాలను కూడా పేర్కొంది.

Also Read: నాని ‘బ్లడీ రోమియో’ లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్..? వైరల్ అవుతున్న డైరెక్టర్ సుజిత్ లేటెస్ట్ పోస్ట్!

విజయ్ చాలా కాలం నుండి మెంటల్ డిసార్డర్ తో బాధపడుతున్నాడని , ఆ కారణం చేత నేను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటూ పిటీషన్ లో పేర్కొంది. ఆ పిటీషన్ ని మీరు క్రింద చూడొచ్చు. అయితే విజయ్ ఆమె చెప్పినట్టు మెంటల్ డిసార్డర్ తో బాధపడుతున్నట్టు మాకు ఎవ్వరికీ అనిపించడం లేదు, గత కొంత కాలంగా సంగీత విజయ్ కి దూరం గా ఉంటూ వస్తున్న విషయం వాస్తవమే , కానీ ఆమె DMK పార్టీ తో చేతులు కలిపింది. ఆ కారణం చేతనే సమయం చూసి ఎన్నికల సమయం లో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి వీటిల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.


🔴LIVE: Tvk Vijay | vijay wife sangeetha | சங்கீதா நோட்டீஸ்! விஜய்க்கு விவாகரத்து?

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version