Ind vs Eng 2nd Test: మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలు ఉంటాయి. కొన్ని మాత్రమే వినియోగదారుల మనసు దోచుకుంటాయి. ఆ కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులకే డిమాండ్ ఉంటుంది. ఆ కంపెనీలే లాభాలు నమోదు చేస్తాయి. అంతకంతకు ఎదిగిపోతాయి. ఆ కంపెనీలు అనుసరిస్తున్న వినూత్నత వల్లే వినియోగదారులు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. స్థూలంగా చెప్పాలంటే రొటీన్ గా చేసేదానికంటే.. భిన్నంగా చేసేదానికే వ్యాల్యూ ఎక్కువగా ఉంటుంది. భిన్నత్వానికే ఈ ప్రపంచం ఓటు వేస్తుంది.
ఇలాంటి భిన్నత్వాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ ప్రదర్శించింది. ఆదివారం ఇంగ్లాండ్ గడ్డమీద ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో భారత్ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో.. పంజాబ్ జట్టు యాజమాన్యం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఒక విభిన్నమైన పోస్ట్ చేసింది. అది చూడగానే ఆకట్టుకుంటున్నది. టీం ఇండియా సాధించిన విజయాన్ని పంజాబ్ జట్టు యాజమాన్యం గొప్ప గొప్ప వాక్యాలలో చెప్పలేదు. తాటికాయంత అక్షరాలతో పోస్టులు పెట్టలేదు. జస్ట్ రెంటంటే రెండు వాక్యాలలో ముగించింది. కానీ ఆ వాక్యాలలో ఉన్న గాడత.. లోతైన అర్థం అద్భుతంగా ఉంది.
రెండవ టెస్ట్ చివరి రోజు ఇంగ్లాండులో వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల మొదటి సెషన్ నిర్వహణలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వర్షం కురవాలని ఇంగ్లాండ్ జట్టు.. కురవకూడదని భారత జట్టు ప్రార్థించాయి. చివరికి భారత జట్టు ప్రార్థనలు ఫలించాయి. భారత జట్టు బౌలర్ ఆకాష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఇంగ్లాండు టాప్ ఆర్డర్ మొత్తాన్ని తన బౌలింగ్ విన్యాసంతో కకావికలం చేశాడు. పిచ్ మీద ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ పదునైన బంతులు వేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు.
Also Read: టీమిండియా గెలిచాక ఆ జర్నలిస్ట్ కోసం వెతికిన శుభ్ మన్ గిల్.. కనిపించకుండా పోయాడు
వాస్తవానికి వర్షం అలాగే కురిస్తే మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోయేది. అప్పుడు మ్యాచ్ డ్రా అయ్యేది. ఇంగ్లాండ్ జట్టు కూడా ఇదే కోరుకుంది. కానీ వర్షం తగ్గడంతో మైదానాన్ని త్వరగానే ఆరబెట్టారు. పిచ్ ను నిర్వహణకు సిద్ధం చేశారు. సరిగా ఇదే పరిణామాన్ని పంజాబ్ జట్టు యాజమాన్యం తన పోస్టులో ప్రస్తావించింది. మైదానంలో వర్షం కురుస్తున్న దృశ్యాన్ని..”ఇంగ్లాండ్ ఇలాంటి ఆకాష్ ను కోరుకుంది.. కానీ ఆకాష్ ఇలా ఆరు వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు” అని అర్థం వచ్చేలా ఇంగ్లీషులో రాసింది. ఈ పోస్ట్ క్రికెట్ అభిమానులకు విపరీతంగా నచ్చుతోంది. ముఖ్యంగా టీమ్ ఇండియా అభిమానులకు విశేషంగా నచ్చుతుంది. అందువల్లే సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. “పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ అద్భుతంగా ఆలోచించింది. ఇలా ఎవరు ఆలోచించి ఉండరు. అందువల్లే ఈ పోస్ట్ విపరీతంగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. టీమిండియా విజయాన్ని ఇలా క్లుప్తంగా చెప్పడం గొప్ప విషయం.. వారి క్రియేటివిటీకి సెల్యూట్” అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
Bhai toh England pe baras gaye! ️#ENGvIND pic.twitter.com/YS5DCUG4YA
— Punjab Kings (@PunjabKingsIPL) July 6, 2025