YSR 76 Birthday: మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఏపీలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. మరోవైపు కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి కి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో వచ్చి రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద అంజలి ఘటించారు. అయితే అంతా కలుస్తారని భావించిన వైయస్సార్ కుటుంబ అభిమానులకు నిరాశ మిగిల్చారు.
Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025
తల్లి విజయమ్మతో షర్మిల..
ఈరోజు ఉదయమే తల్లి విజయమ్మతో( Vijaymma) పాటు ఇడుపాలపాయకు చేరుకున్నారు షర్మిల. నేరుగా రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించి ఆమె వెళ్లిపోయారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అక్కడకు కొద్దిసేపటికి జగన్మోహన్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. భార్య భారతి తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం సామూహిక ప్రార్ధనలు చేశారు. అయితే వైయస్ కుటుంబ సభ్యులలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి వెంట.. మరి కొంతమంది షర్మిల వెనుక ఉండడం విశేషం. అయితే విజయమ్మ అటు కుమార్తె షర్మిల తో.. ఇటు కుమారుడు జగన్ తో కలిసి పాల్గొనడం విశేషం.
వైయస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది… ప్రజా సంక్షేమం పేరుతో జనం గుండెల్లో చెరగని సంతకం చేసిన మహానేత వైయస్ఆర్. నా ప్రతి అడుగులో నాన్న గారే నాకు మార్గదర్శి. నాన్న గారే నాకు స్ఫూర్తి. #YSRJayanthi pic.twitter.com/dJZ9i5Wbsi
— YS Sharmila (@realyssharmila) July 8, 2025
ఒకప్పుడు అంతా కలిసి..
షర్మిల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఉన్నప్పుడు.. సోదరుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించేవారు. అయితే వారి మధ్య రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు రావడంతో ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉండేవారు. ఆ పదవిని వదులుకొని ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిన కుమార్తె షర్మిలకు అండగా నిలిచారు. అయితే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీలో ఆ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. దీంతో అప్పటినుంచి విజయమ్మ పిల్లలిద్దరితో సమానంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు సైతం అడ్డగోలుగా చీలిపోయారు. కొందరు షర్మిల వెంట.. మరికొందరు జగన్ వెంట ఉన్నారు. మరికొందరు మధ్యే మార్గంగా ఉంటున్నారు.
మహానేత YSR జయంతి సందర్భంగా హైదారాబాద్ పంజాగుంట లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు pic.twitter.com/NXk1NinLuT
— Rahul (@2024YCP) July 8, 2025