Kateramma’s son retirement reason : అయితే అటువంటి ఆటగాడు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికాడు. ఒకరకంగా అతడు తీసుకొన్న నిర్ణయం ఆచార్యాన్ని కలిగించగా.. గాయాల వల్ల అతడు ఆ నిర్ణయం తీసుకొని ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ నిర్ణయం వెనక పట్టరాని బాధ.. భరించలేని ఆవేదన ఉంది. అందువల్లే అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తన రిటైర్మెంట్ కి సంబంధించి దారి తీసిన కారణాలను స్వయంగా దక్షిణాఫ్రికా ప్లేయర్ క్లాసెన్ వెల్లడించాడు. తన నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని.. అనేక రోజుల మదనం తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్లాసెన్ వెల్లడించాడు.. దీంతో దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న లుకలుకలు ఒకసారిగా బయటపడ్డాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
క్లాసెన్ ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అతడు 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలి అనుకున్నాడు.. కానీ క్రికెట్ బోర్డుతో అతడికి గ్యాప్ పెరిగింది. మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ మేనేజ్మెంట్ నుంచి అతడికి సపోర్ట్ లభించలేదు. దీనికి తోడు అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు.. అది ఒక రకంగా క్లాసెన్ ను అంతర్మథనంలో పడేసింది. దీంతో అతడు తన కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తను జట్టు కోసం ఎంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పునరాలోచనలో పడ్డాడు. మరో మాటకు తావు లేకుండా.. కుటుంబ సభ్యులతో చర్చించి అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం జరిగిపోయాడు. ” దక్షిణాఫ్రికా జట్టు కోచ్ రాబ్ వాల్టర్ గా ఉన్నప్పుడు బాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలు జట్టులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. స్వేచ్ఛగా ఆడేందుకు పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇలాంటి క్రమంలో జట్టులో ఉండడంలో అర్థం లేదు అనిపించింది. అందువల్ల ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటున్నాను. స్వేచ్ఛగా ఆడే అవకాశం వచ్చిందని అనుకుంటున్నానని” క్లాసెన్ పేర్కొన్నట్టు దక్షిణాఫ్రికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ” అతడు ఇంకొంత కాలం క్రికెట్ ఆడితే బాగుండేది. జట్టులో ఉంటే ఇంకా బాగుండేది. జట్టు అద్భుతమైన విజయాలు సాధించేది. కాని కీలక దశలో అతడు వెళ్లిపోయాడు. ఇది అతని అభిమానులుగా మాకు ఇబ్బందికరంగా ఉంది. అతడు లేని ఆటను చూడటమంటే కాస్త కష్టమే. అతడి అభిమానులుగా బాధపడుతున్నాం. ఇబ్బంది పడుతున్న.. అయినప్పటికీ చేసేది ఏమీ లేదు కదా” అంటూ క్లాసెన్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : కాటేరమ్మ కొడుకంటే ఎవరో క్లాసెన్ కు తెలిసిపోయింది.. వైరల్ వీడియో