Prabhas best shot liked by Rajamouli : యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… తను కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో చేసిన ఛత్రపతి సినిమా అతనికి ఆల్ టైం ఫేవరెట్ సినిమా అనే చెప్పాలి. అతని అభిమానులు సైతం ఆ సినిమాని చూసి ఆశ్చర్యపోయారు. ఇక చాలామంది అతనికి అభిమానులుగా మారారు. ఆ సినిమాలో ఆయన నటించే నటన గాని, యాక్షన్స్ సన్నివేషాల్లో ఆయన చూపించే తెగువ గాని ప్రతి ఒక్కటి ప్రేక్షకుడిని కట్టిపడేసిందనే చెప్పాలి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ఈ రోజున స్టార్ హీరోగా వెలుగుందుతున్నాడు అంటే దానికి కారణం ఛత్రపతి సినిమా కూడా ఒక కారణం అనే చెప్పాలి. అందులో అతని నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం చత్రపతి సినిమా తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంటైర్ చత్రపతి సినిమాలో ప్రభాస్ నటించిన సీన్స్ లో ఏ సీన్ అంటే మీకు చాలా ఇష్టం అని అడిగినప్పుడు ఒక పిల్లాడు తన గుడ్డి తల్లికి అన్నం తినిపిస్తుంటే ప్రభాస్ చూస్తాడు. తన తల్లిని గుర్తు చేసుకొని, తన తల్లి తనకు అన్నం తినిపించిన రోజులను గుర్తు చేసుకుంటాడు.
అలాగే ఆ పిల్లాడు కి వాళ్ళ అమ్మకి మధ్య ఉన్న ప్రేమను చూసి మురిసిపోతూనే ఆ ప్రేమను నేను కోల్పోయాను అనే ఒక బాధని కూడా చూపిస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే టైంలో ఆ పిల్లాడు వాళ్ళమ్మ హ్యాపీగా ఉన్నారు అనే దానికి సంతోషాన్ని చూపిస్తూనే, బట్ ఆ హ్యాపీనెస్ నాకు దక్కడం లేదు అనే విషయంలో సాడ్నెస్ కూడా చూపించాలి.
ఒకేసారి రెండు ఎమోషన్స్ ను పలికించాలి. కానీ ప్రభాస్ మాత్రం ఆ షాట్ లో అద్భుతంగా నటించాడు. ఎంటైర్ సినిమాకి ఆ షాట్ హైలెట్గా నిలిచింది అంటూ రాజమౌళి చెప్పడం అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది.
మొత్తానికైతే ప్రభాస్ – రాజమౌళి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాయి… ఇక ఫ్యూచర్ లో కూడా వీళ్ళ కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.