Jasprit Bumrah : జస్ ప్రీత్ బుమ్రా టీ మీడియా సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు చేయలేని పని.. మిగతా బౌలర్లు చేయలేని పని అతడు చేశాడు. అందువల్లే టీమిండియాలో టాప్ ఆటగాడిగా ఆవిర్భవించాడు. అక్కడిదాకా ఎందుకు గత ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమైనప్పుడు.. జట్టును జస్ ప్రీత్ బుమ్రా నడిపించాడు. ఆస్ట్రేలియాపై విజయం సాధించేలా చేశాడు. ఆ మ్యాచ్లో జస్ ప్రీత్ బుమ్రా మ్యాన్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.. అయితే ఆ తదుపరి మ్యాచ్లలో జస్ ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు తేలిపోవడంతో టీమిండియా ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నష్టపోయింది. ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ వెళ్లలేకపోయింది.
Also Read : అదే రోహిత్ కెప్టెన్సీలో గొప్పతనం.. అందువల్లే టీమిండియా గెలిచింది..
గాయపడ్డాడు
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయానికి గురయ్యాడు. ఆ సమయంలో అతడు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం కొంతకాలం పాటు అతడు క్రికెట్ కు దూరమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అతడు జట్టులోకి వచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అంతేకాదు ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. అయితే సిడ్నీ టెస్టులో అతడు మళ్ళీ వెన్నెముక గాయానికి గురయ్యాడు. దీంతో అతడు అకస్మాత్తుగా మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఇంకా అప్పట్నుంచి అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడు దూరమయ్యాడు. ఇప్పుడు త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మొదలు కాబోతోంది. ఈ సమయంలో అతడు ముంబై ఇండియన్స్ కు ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముంబై జట్టు జస్ ప్రీత్ బుమ్రా పై భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు లేదా నాలుగు మ్యాచ్ల వరకు జస్ ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది..జస్ ప్రీత్ బుమ్రా గాయంపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు..” జస్ ప్రీత్ బుమ్రా కు అదే స్థానంలో మరోసారి గాయమైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అది అతడి కెరియర్ కు ముగింపు పలికేలా చేయవచ్చు. ఆ స్థానంలో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు జస్ ప్రీత్ బుమ్రా సుముఖంగా ఉంటాడో? లేదో? తెలియదని” షేన్ బాండ్ వ్యాఖ్యానించాడు . షేన్ బాండ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జస్ ప్రీత్ బుమ్రా ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో అతడు ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : బుమ్రాకు గాయం.. కారణం ఏంటి.. బాధ్యులు ఎవరు?