Wimbledon Final 2025: పచ్చికమైదానం.. కొదమసింహాల్లా సిన్నర్, అల్కరాజ్.. హోరాహోరీగా పోటీపడ్డారు. అల్కరాజ్ పదేపదే మణికట్టు షాట్లు కొట్టి అదరగొట్టాడు . సిన్నర్ డిఫెన్స్ యత్నాన్ని కొనసాగించాడు. ఒకానొక దశలో అల్క రాజ్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ అప్పుడే సిన్నర్ తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. అంతే ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు తన మాతృదేశమైన ఇటలీకి సరికొత్త ఘనతను అందించాడు.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
వింబుల్డన్ 2025 తుది పోరులో సిన్నర్ విజేతగా నిలిచాడు.. అంతేకాదు వింబుల్డన్ ఓపెన్ ఏరా విభాగంలో టైటిల్ సాధించిన మొదటి ఇటాలియన్ ప్లేయర్గా అతడు రికార్డ్ సృష్టించాడు.. తద్వారా గత నెలలో రోలాండ్ గారోస్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు.. డిపెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ తో హోరాహోరీగా పోరాడి ఛాంపియన్ గా నిలిచాడు. ఈ టోర్నీలో అల్క రాజ్ డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగాడు.. ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ సాగింది.. మూడు గంటలపాటు హోరాహోరీగా సాగింది. అల్క రాజ్ ను నాలుగు సెట్లలో సిన్నర్ ఓడించాడు. 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో మట్టి కరిపించాడు. మొదటి సెట్ లో అల్క రాజ్ 4-2 లీడ్ సాధించాడు. అల్క రాజ్ తిరుగులేని స్థాయిలో ఆడాడు. వరుసగా నాలుగు గేమ్స్ గెలిచాడు. తద్వారా తొలి సెట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత విన్నర్ తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. అల్క రాజ్ సర్వీస్ మొత్తాన్ని బ్రేక్ చేశాడు. తన సర్వీస్ నిలబెట్టుకుంటూ సెట్ సొంతం చేసుకున్నాడు.
ఇలా మ్యాచ్ సాగుతుండగానే ఓ అభిమాని షాంపైన్ బాటిల్ ఓపెన్ చేశాడు. అది సిన్నర్ కాళ్ల వద్ద పడింది. దీంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగింది. అయినప్పటికీ సిన్నర్ తన లయను కోల్పోలేదు. సొంతం చేసుకున్నాడు. అనంతరం మూడు, నాలుగు సెట్లను కూడా గెలిచి మ్యాచ్ ను విజయంతో పూర్తి చేశాడు. ఈ విజయం ద్వారా డిన్నర్ తన నాలుగవ గ్రాండ్ స్లాం టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.. ఈ విజయం ద్వారా సిన్నర్ కెరియర్లో ఊహించని గ్రోత్ చూశాడు. గత ఎడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా తన మొదటి గ్రాండ్ స్లామ్ ను సిన్నర్ సొంతం చేసుకున్నాడు. ఇది గెలిచిన కేవలం 532 రోజుల తర్వాత మరో గ్రాండ్ స్లామ్ అందుకున్నాడు. అత్యంత వేగవంతమైన దూకుడుతో రోజర్ ఫెదరర్ తర్వాత స్థానంలో సిన్నర్ నిలిచాడు. ఫెదరర్ 434 రోజుల వ్యవధిలోనే మొదటి నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ దక్కించుకున్నాడు.. ఈ విజయం ద్వారా సిన్నర్ కు 35 కోట్ల నగదు బహుమతి లభించింది..
ఫైనల్ లో ఓటమికి ముందు వరకు అల్కరాజ్ వింబుల్డన్ లో వరుసగా 20 మ్యాచ్ లు గెలిచాడు. 2023, 2024లో అతడు టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. టూర్ లెవెల్ విభాగంలో 38 మ్యాచ్ లలో 35 గెలిచాడు. ఓపెన్ ఏరా లో ఇది ఒక రికార్డు.. 2022లో సిన్నర్ చేతిలో అల్క రాజ్ ఓడిపోయాడు. ఇక ఈ గెలుపు ద్వారా సిన్నర్ నాల్గవ గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు హ్యాట్రిక్ గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకోవాలనే అల్క రాజ్ కలను సిన్నర్ బ్రేక్ చేశాడు..సిన్నర్ ఖాతాలో 2024, 2025 ఆస్ట్రేలియా ఓపెన్, 2024 యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో వింబుల్డన్ కూడా చేరింది. మొత్తంగా అతని ఖాతాలో నాలుగు టైటిల్స్ ఉండడం గమనార్హం.
Sinner shined in the biggest moments
Today’s Play of the Day, presented by @BarclaysUK #Wimbledon pic.twitter.com/KF8rG5fTNa
— Wimbledon (@Wimbledon) July 13, 2025