spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ వెనుక.. ఇంతటి దుఃఖం ఉందా?

Ishan Kishan: ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ వెనుక.. ఇంతటి దుఃఖం ఉందా?

Ishan Kishan: టి20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ తర్వాత ఆ స్థాయిలో ఆట తీరు కొన సాగించిన ప్లేయర్ ఇషాన్ కిషన్. ఫైనల్ మ్యాచ్లో అతడు మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. అటువంటి ఇషాన్ కిషన్ కు సంబంధించిన ఒక విషయం కంటతడి పెట్టిస్తోంది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

ఇషాన్ కిషన్ ఫైనల్ మ్యాచ్లో మైదానంలో చురుకుగా కనిపించాడు. హాఫ్ సెంచరీ చేయడం మాత్రమే కాదు.. అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు. ఇక ఫీల్డింగ్ లో అయితే పాదరసం మాదిరిగా కదిలాడు. మ్యాచ్ అనంతరం తన ప్రేయసి అదితి కి ముద్దు కూడా పెట్టాడు. అదితి తో అతడు చాలాకాలంగా డేటింగ్ లో ఉన్నాడు. మైదానంలో సరదాగా ఉన్న ఇషాన్ కిషన్.. వెనుక ఒక బాధాకరమైన గాధ దాగి ఉంది.

ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. దీంతో అతడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. అయితే ఆమె కోసమైనా సరే తాను గొప్పగా ఆడాలని ఇషాన్ కిషన్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని అతడు హార్దిక్ పాండ్యాతో పంచుకున్నాడు. అతడు ప్రోత్సాహం ఇవ్వడంతో వేగంగా పరుగులు తీశాడు. మహిళా దినోత్సవం రోజున టీమిండియా గెలిచిన నేపథ్యంలో.. ఈ విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నట్టు కిషన్ పేర్కొన్నాడు. కిషన్ కజిన్ సిస్టర్, ఆమె భర్త ఈనెల 6న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దారుణం వల్ల కిషన్ కుటుంబ సభ్యులు ఫైనల్ మ్యాచ్ కు హాజరు కాలేకపోయారు. ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం ఇషాన్ కిషన్ బ్యాట్ ఆకాశం వైపు చూపించాడు. ఆ తర్వాత తన సోదరికి నివాళులర్పించాడు. ఫైనల్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 25 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో 9 మ్యాచులు ఆడిన కిషన్.. 317 పరుగులు చేశాడు. హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇదే కాకుండా మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఇషాన్ కిషన్ పంచుకున్నాడు. ” సూర్య కుమార్ యాదవ్ నాకు ఫోన్ చేశాడు. ప్రపంచ కప్ అందిస్తున్నావా? లేదా? అని నన్ను అడిగాడు..” “దీనికి మీరు సానుకూల దృక్పథంతో ఉన్నారా? లేదా?” అని నేను అడిగాను. దానికి “సానుకూల దృక్పథంతోనే ఉన్నాను అని” సూర్య కుమార్ ఇషాన్ కిషన్ తో అన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version