spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలబడడమే కాకుండా, ఈ ఏడాది అత్యధిక లాభాలను రాబట్టిన టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిల్చింది. కొత్త సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం ఇప్పటికీ స్టడీ వసూళ్లతో దూసుకెళ్తూ, అఖిల్ స్టామినా ఏంటో మరోసారి అందరికీ అయ్యేలా చేసింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అఖిల్ చేసిన ప్రొమోషన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఒకవిధంగా ఈ ప్రొమోషన్స్ కూడా సినిమాపై జనాల్లో ఆసక్తి కలిగించడం లో సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు. కేవలం ఇంటర్వ్యూస్ , ఈవెంట్స్ మాత్రమే కాకుండా, టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా అఖిల్ చురుగ్గా పాల్గొన్నారు.

అందులో భాగాంగా ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ షో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లో అఖిల్ పాల్గొన్నారు. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా పాల్గొన్నది. ఈ ప్రోగ్రాం కి అనేక మంది టీవీ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా వచ్చారు. వారిలో ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరోయిన్ దీపికా కూడా ఉంది. ఈమె ఎంత సరదా మనిషి అనేది , రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్ షోస్ ని చూసే వాళ్లకు అర్థం అవుతుంది. ఈమె వచ్చిందంటే చాలు , షో మొత్తం సందడే. ఈమె అత్యుత్సాహం తో అతిధులను అప్పుడప్పుడు బెదరగొడుతూ ఉంటుంది. అలా అఖిల్ రాగానే ఈమె మాట్లాడిన మాటలు , అందుకు అఖిల్ వేసిన కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందుగా దీపికా మాట్లాడుతూ ‘ఏమైనా సరే.. ఆరు అడుగుల యాపిల్ చెట్టు మీరు. పెడుతారా ఒక ముద్దు?’ అని అడగ్గా, ‘ముద్దు అయితే ఇవ్వలేను కానీ , రా హగ్గు ఇస్తాను’ అని హగ్ ఇచ్చారు అఖిల్.

అందుకు దీపికా ఎంతగానో మురిసిపోయింది. ఆ తర్వాత ‘అఖిల్ గారు.. మీ చేతిలో ఉన్నది బొంగరం, నా చేతికి వేస్తారా ఉంగరం’ అని అంటుంది దీపికా. అప్పుడు అఖిల్ ‘మా ఆవిడ సంగతి తెలీదు నీకు.. జాగ్రత్త’ అని నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అఖిల్. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యినటువంటి ఈ వీడియో ని మీకోసం కింద అందిస్తున్నాము చూడండి. దీనిపై కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

Akkineni akhil lenin movie success show #trendingshorts #ajframesig
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Oktelugu Epaper
Exit mobile version