spot_img
Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson Man Of The Series T20 WC: న్యూజిలాండ్ సిరీస్ లో అట్టర్...

Sanju Samson Man Of The Series T20 WC: న్యూజిలాండ్ సిరీస్ లో అట్టర్ ఫ్లాప్.. టి20 వరల్డ్ కప్ లో మెన్ అఫ్ ది సిరీస్.. సంజు 2.0 వెనుక ఉన్నది అతడే!

Sanju Samson Man Of The Series T20 WC: న్యూజిలాండ్ సిరీస్లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. కనీసం చెప్పుకునే స్థాయిలో పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో అతడిని జట్టులో ఎందుకు ఉంచుతున్నారు.. తుది జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు.. అని క్రికెట్ విశ్లేషకులు.. మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అయినప్పటికీ అతని మీద మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. టి20 వరల్డ్ కప్ లో అవకాశం కల్పించింది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

టి20 వరల్డ్ కప్ లో అవకాశం వచ్చినప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అభిషేక్ శర్మకు అనారోగ్యం.. రింకు సింగ్ సరిగ్గా ఆడలేక పోవడంతో అతడికి తుది జట్టులో చోటు లభించింది. సూపర్ 8 లో భాగంగా జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఒక్కసారిగా సింహం మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 97* పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము అతడు అతడు అని సంబోధిస్తున్న ఆ ఆటగాడు ఎవరో..

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీం మీడియా తరఫున సంజు శాంసన్ అదరగొట్టాడు. అభిషేక్ శర్మ.. సూర్య కుమార్ యాదవ్.. హార్థిక్ పాండ్యా విఫలమైన చోట అతడు స్థిరంగా నిలబడ్డాడు. వరుసగా మూడు మ్యాచ్లలో.. అది కూడా టీమిండియా గెలుపును నిర్దేశించే తీరులో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేశాడు. తద్వారా మెన్ అఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ లో అట్టర్ ఫ్లాప్ అయిన సంజు.. కేవలం రోజుల వ్యవధిలోనే ఫినిక్స్ పక్షి మాదిరిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

సంజు ఈ స్థాయిలో ఆడటం వెనుక ఒక దిగ్గజ ప్లేయర్ ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. సచిన్ టెండూల్కర్. గడచిన రెండు నెలలుగా సచిన్ సంచి తో మాట్లాడుతూనే ఉన్నాడు.. అతడిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేశాడు. “నిరాశ అనేది వద్దు. రిజర్వు బెంచ్ లో కూర్చున్నంత మాత్రాన బాధపడకూడదు. లోపాల మీద దృష్టి సారించు. మెరుగైన బ్యాటింగ్ చేయి. ఏమాత్రం ఇబ్బంది పడకుండా భారీ ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఆలోచన చేయి. తద్వారా నీలో కొత్త ఆటగాడు బయటపడతాడని.. సచిన్ ఇదే తీరుగా నాతో మాట్లాడేవాడని” సంజు పేర్కొన్నాడు.

జింబాబ్వేతో 15 .. వెస్టిండీస్ జట్టుతో 50 బంతుల్లో 97* పరుగులు, ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్ లో 42 బంతుల్లో 89, ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద 46 బంతుల్లో 89 పరుగులు చేసి తన సత్తా ఏమిటో నిరూపించాడు. అందువల్లే టీమిండియా టి20 వరల్డ్ కప్ అందుకుంది.. అంతేకాదు, ప్రపంచ జట్లకు సాధ్యం కాని విధంగా వరుసగా రెండవసారి.. టి20 ప్రపంచ కప్ చరిత్రలో మూడవసారి ట్రోఫీని అందుకుని అరుదైన ఘనతను సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version