Asia Cup 2023: ఇంత చెత్త పర్ఫామెన్స్ తో టీం ఇండియా ప్రపంచ కప్ పోరు సాధ్యమేనా..?

పరుగుల వరద పారిస్తాడు అనుకున్న శుభ్‌మన్ గిల్ పెవిలియన్ వైపు పరిగెత్తాడు. దానికి తోడు టీం ఇండియా ముందు ఇంకా ఎల్కేజీ దశలో ఉన్న నేపాల్ లాంటి టీం తో ఆడినప్పుడు రోహిత్ శర్మ తడబడడం అందరిని ఆశ్చర్యపరిచింది.

Written By: Vadde, Updated On : September 5, 2023 11:15 am

Asia Cup 2023

Follow us on

Asia Cup 2023: ఆసియా కప్ కోసం సిద్ధమయ్యామని.. అసలు ఇది ఫిట్నెస్కు పరీక్ష కాదని పాక్తో జరగబోయే మ్యాచ్ ముందు కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. అంతేకాదు నిప్పులు చెరిగే బౌలర్లైన…పాక్ ఆటగాళ్లను తమ అనుభవంతో ఎదుర్కొంటాము అన్న ధీమాని కూడా వ్యక్తం చేశాడు. మ్యాచ్లో చింపేస్తారు అనుకున్న సదరు బ్యాట్స్మెన్ అందరూ పాక్ పెసర్ల బౌలింగ్ ధాటికి తికమక పడడమే కాకుండా ఒక్క అంకె స్కోర్ తో పెవిలియన్ చేరుకున్నారు. చిరకాల ప్రత్యర్థి తో జరిగిన పోరులో ఘోరంగా విఫలం అవడంతో టీమిండియా అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు.

మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ తట పటాయించగా..లోయరార్డర్ కుప్పకూలింది. ఏదో ఇషాన్ కిషన్ ,హార్దిక్ పాండ్యా కాస్త నిలబడ్డారు కాబట్టి కనీసం పరువు దక్కింది. ఇదే రకమైన ప్రదర్శన కనబరుస్తూ ఉంటే ఇక రాబోయే ప్రపంచ కప్ లో భారత్ టీం ఏం చేస్తుంది అన్న టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. టాప్ ఆర్డర్ లో ఉన్న ప్రధాన బ్యాటర్లు ఎవరు ఉత్తమమైన ఫామ్ లో కనిపించడం లేదు…మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీం ను గెలుపు వైపు నడిపించాల్సిన కెప్టెన్ రోహిత్ ,సీనియర్ ప్లేయర్ కోహ్లీ నిలకడ లేని ఆట తీరు కనబరుస్తున్నారు. మొన్న పాక్ తో జరిగిన పోరులో కూడా వీళ్ళిద్దరూ ఎంతో దారుణంగా విఫలమయ్యారు.

పరుగుల వరద పారిస్తాడు అనుకున్న శుభ్‌మన్ గిల్ పెవిలియన్ వైపు పరిగెత్తాడు. దానికి తోడు టీం ఇండియా ముందు ఇంకా ఎల్కేజీ దశలో ఉన్న నేపాల్ లాంటి టీం తో ఆడినప్పుడు రోహిత్ శర్మ తడబడడం అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి ఓవర్ లోని నేపాల్ పేసర్ కరణ్ కేసి బౌలింగ్ కి రోహిత్ తెగ పరేషాన్ అయ్యాడు. రెండుసార్లు బంతి అతని ప్యాడ్ కి తాకడంతో ఎల్బీ కోసం నేపాల్ టీం రివ్యూ కూడా అడగడం జరిగింది. మరోపక్క ఓపెనర్ అయిన శుభ్‌మన్ గిల్ బాల్ ను బౌండరీ వైపు పరుగులు పెట్టించడంతో రోహిత్ పై కాస్త ఒత్తిడి తగ్గింది.

వరుణదేవుడు కరుణించి కాస్త అంతరాయం తెప్పించాడు…ఇది రోహిత్ కి కలిసే వచ్చింది. ఆ కాస్త వ్యవధిలో క్రికెట్ అనలిస్టు వద్దకు వెళ్లి నేపాల్ బౌలర్ బౌలింగ్ ని కాస్త పరిశీలించి.. తాను చేస్తున్న తప్పు ఏంటో తెలుసుకున్న రోహిత్ ఆ తరువాత మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక రెచ్చిపోయాడు. సరే బ్యాటింగ్ అంటే ఏదో ఒకలాగా కానిచ్చారు.. మరి బౌలింగ్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. నేపాల్ లాంటి టీం భారత్ లాంటి ఎక్స్పీరియన్స్ జట్టుకు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అంటే టీమిండియా బౌలింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

మరోపక్క ఇదే నేపాల్ టీం పాకిస్తాన్ బౌలర్ల ముందు క్రీజ్ లో కదల లేక 104 పరుగులకే కుప్పకూలింది. పాక్ పెసర్ల కంటే మెరుగైన ప్రదర్శన కనబరచలేని బౌలర్లా టీమిండియాలో ఉండేది? అనే డౌట్ సర్వత్రా వినిపిస్తోంది. పాక్ పెసర్ల బంతులను టచ్ కూడా చేయలేక పోయిన నేపాల్ బ్యాటర్స్…భారత్ బౌన్సర్లు వేసిన బాల్స్ ను భారీ సిక్సులు గా మార్చారు. ఇక ఫీల్డింగ్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాళ్ళు కూడా ఫీల్డింగ్ ఇంతకంటే బాగా చేస్తారేమో అనిపించే అంత నాసిరకంగా ఉంది టీం ఇండియా ఫీల్డింగ్.

చేతికి వచ్చిన క్యాచ్ ని కూడా అందుకోలేకపోవడం.. మొదటి ఆరు ఓవర్లలో మూడు క్యాచ్లను అనవసరంగా జారవిడుచుకోవడం.. ఇలాంటి తప్పిదాల వల్ల సునాయాసంగా పోవాల్సిన వికెట్లు ఆగిపోయాయి. ప్రస్తుతం టీం ఇండియా పర్ఫామెన్స్ చూస్తే..ఒక్క అంశంలో అయినా స్ట్రాంగ్ గా ఉందా అంటే ప్రశ్నార్ధకమే అని చెప్పవచ్చు. కనీసం ఈ రెండు మ్యాచ్లలో బయటపడ్డ బలహీనతలను గుర్తించి ఇకనైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని గాడిలో పడకపోతే మనం కేవలం ప్రపంచ కప్ కి హోస్టులుగా మాత్రమే మిగలాల్సి వస్తుంది.