Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగునా అపూర్వ సాగతం లభించింది. అశేష ప్రజానీకాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా మాట్లాడాడు. ఈ గోదావరి జిల్లాల్లో పోటీచేసి ఓడిపోయిన తనకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చాడు.
గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేసి ఓడిపోయిన పవన్ నాడు తన పడ్డ బాధను చెప్పుకొచ్చాడు. కానీ అంబేద్కర్ లాంటి వారే మొదటి జనరల్ ఎలక్షన్స్ లో ఓడిపోయారని.. తాను ఎంత అనుకొని ఊరుకున్నానన్నారు. ఓటమి నుంచి తేరుకోవడానికి తనకు 15 నిమిషాలు పట్టిందని పవన్ చెప్పుకొచ్చాడు.
ఇక మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్ తాను బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నానని అంటున్నాడని.. అసలు ముఖ్యమంత్రి జగన్ నొక్కని బటన్లు చాలా ఉన్నాయని పవన్ చెప్పుకొచ్చాడు.. పోలవరం ప్రాజెక్ట్ నుంచి రోడ్లు, ప్రాజెక్టులు, బ్రిడ్జీలు, విద్యార్థులకు నోటీఫికేషన్లు సహా ఎన్నో జగన్ నెరవేర్చని హామీలపై బటన్లు నొక్కలేదంటూ పవన్ ఎత్తి చూపారు. ఆ వీడియోను కింద చూడొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు పని ఎందుకు చేయడం లేదో కూడా పవన్ కళ్యాణ్ వివరించారు..