IPL trophy 2025 schedule : ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ (Indian premier league) కు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.. ఐపీఎల్ నిర్వాహక కమిటీ(IPL managing committee) ఆదివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు షెడ్యూల్ ను వెల్లడించడం మొదలుపెట్టింది. జియో సినిమా(jio cinema), స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్(Star sports network) లో ఇది లైవ్ టెలికాస్ట్ అవుతున్నది.. ఐపీఎల్(IPL) లో డిపెండింగ్ ఛాంపియన్(depending champion) గా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) జట్టు తన తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(royal challengers Bengaluru) జట్టుతో ఆడుతుంది. మార్చి 22న శనివారం కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్(Kolkata Eden gardens) వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది.
ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. 18 వ సీజన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు నిర్వాహ కమిటీ ఏర్పాటు చేస్తోంది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటయింది. ఇక ప్రస్తుత ఏడాది జరిగే లీగ్ 18వది. ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్, ప్లే ఆఫ్ -2 మ్యాచ్ కోల్ కతా లో జరిగే అవకాశం ఉంది. హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్, మరొక జట్టు మధ్య నిర్వహిస్తారు.. ఈ ఏడాది తొలి మ్యాచ్ లో కోల్ కతా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. గత ఏడాది సీజన్లో చెన్నై జట్టు, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు సొంతమైదనంలో సగం మ్యాచులు ఆడాలి. మిగతా మ్యాచులు ప్రత్యర్థి మైదానాలలో ఆడాలి. అయితే రాజస్థాన్, ఢిల్లీ జట్లు తమ సొంత మైదానాలతో పాటు, అస్సాం, విశాఖపట్నంలోనూ ఆడతాయి. అయితే ఈ జట్లు అలా ఆడేందుకు గల కారణాలను ఐపీఎల్ నిర్వాహక కమిటీ వెల్లడించలేదు. బహుశా టి20 క్రికెట్ విస్తరణ కోసం ఐపీఎల్ నిర్వాహ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
చెన్నై జట్టు సొంత మైదానంలో ఆడియో మ్యాచులు ఇవే
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైకి పేరు ఉంది. ఇప్పటివరకు ఈ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. అయితే ఈ సీజన్లో చెన్నై జట్టు ఆడే మ్యాచ్ ల వివరాలను ఐపీఎల్ నిర్వాహక కమిటీ వెల్లడించింది.
మార్చి 23న ముంబై జట్టుతో చెన్నై తలపడుతుంది.
మార్చి 28న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో పోటీ పడుతుంది.
ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది.
ఏప్రిల్ 11న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో పోటీ పడుతుంది..
ఏప్రిల్ 25న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతుంది.
ఏప్రిల్ 30న పంజాబ్ జట్టుతో చెన్నై పోటీ పడుతుంది.
మే 12న రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై జట్టు తలపడుతుంది.
మార్చి 23న, ఏప్రిల్ 20న చెన్నై , ముంబై జట్లు తలపడతాయి. మార్చి 23న చెన్నైలో మ్యాచ్ జరిగితే.. ఏప్రిల్ 20న ముంబైలో మ్యాచ్ జరుగుతుంది.
CSK home matches in IPL 2025:
23rd March Vs MI.
28th March Vs RCB.
5th April Vs DC.
11th April Vs KKR.
25th April Vs SRH.
30th April Vs PBKS.
12th May Vs RR. pic.twitter.com/OVEv8gH57A— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2025