IPL trophy 2025
IPL trophy 2025 : కొద్దిరోజులుగా కోల్ కతా లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొద్దిరోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో శనివారం ఆరంభ మ్యాచ్ జరిగేది అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ వర్షం అదే పనిగా కురిస్తే.. గంట ఆలస్యంగా మ్యాచ్ నిర్వహిస్తారు. వర్షం అప్పటికి తగ్గకపోతే మ్యాచ్ రద్దుచేసి.. రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆటగాళ్లపరంగా బలంగానే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కోల్ కతానే బెంగళూరు పై పై చేయి సాధిస్తోంది.. ఇప్పటివరకు కోల్ కతా, బెంగళూరు జట్లు ఐపీఎల్లో 34 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్ కతా 20 సార్లు విజయం సాధించింది. బెంగళూరు 14 సార్లు గెలుపును సొంతం చేసుకుంది. కోల్ కతా బెంగళూరు పై సాధించిన హైయెస్ట్ స్కోర్ 222 పరుగులు.. లోయస్ట్ స్కోర్ 84 పరుగులు.. కోల్ కతా పై బెంగళూరు సాధించిన హైయెస్ట్ స్కోర్ 221 పరుగులు.. లోయస్ట్ స్కోర్ 49 పరుగులు.. ఇక గత సీజన్లో కోల్ కతా, బెంగళూరు రెండుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు కూడా కోల్ కతా నే విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో.. మరో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.
Also Read : ఐపీఎల్ కు తగ్గిన క్రేజ్.. టికెట్లు అలానే మిగిలిపోయాయి..
బెంగళూరు ఈసారి సరికొత్తగా..
గత సీజన్లో బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగం అంతంతమాత్రంగానే ఉండగా.. ఈసారి మాత్రం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, ఎంగిడి, హేజిల్ ఉడ్, నువాన్ తుషార, రసిక్ సలామ్, యష్ దయాళ్ తో పేస్ బౌలింగ్ సరి కొత్తగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్, సాల్ట్, రుమారియో షెఫర్డ్ తో బ్యాటింగ్ దళం కూడా బలంగా కనిపిస్తోంది.
కోల్ కతా ఏం చేస్తుందో..
గత సీజన్లో కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యగా ఉండేవాడు. ఇప్పుడు అతడు పంజాబ్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కోల్ కతా జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తున్నాడు. కోల్ కతా జట్టులో రఘు వంశీ, మనీష్ పాండే, రమణ్ దీప్ సింగ్, రింకు సింగ్, పావెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, గుర్బాజ్ కీలక బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరా, ఇమ్రాన్ మాలిక్, జాన్సన్, మయాంక్ మార్కండే, హర్షిత్ రానా, చేతన్ సకారియా, నోర్ట్జ్వే కీలక బౌలర్లుగా ఉన్నారు. ఇక గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం కోల్ కతా నైట్ రైడర్స్ కు 54 శాతం, బెంగళూరుకు 46% విజయావకాశాలున్నాయి.
Also Read : ఈసారి బ్యాట్లు విరిగిపోతాయి.. బంతులు పగిలిపోతాయి..