IPL 2025
IPL trophy 2025 : దేశ వ్యాప్తంగా ఐపిఎల్ సీజన్ జోరుగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.. విశాఖపట్నం లోని క్రికెట్ స్టేడియం కళ తప్పి కనిపిస్తోంది. ఈ స్టేడియాన్ని ఢిల్లీ జట్టు తన రెండవ మైదానంగా ఎంచుకుంది. ఇక్కడ లక్నో జట్టు, ఢిల్లీ జట్టు మార్చి 24న తలపడబోతున్నాయి. మార్చి 30 ఉగాది రోజున ఢిల్లీ, హైదరాబాద్ జట్లు తలపడతాయి. లక్నో, ఢిల్లీ జట్లు మార్చి 24న తలపడబోతున్న నేపథ్యంలో టికెట్లను అందుబాటులో ఉంచినప్పటికీ అభిమానులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం నిర్వాహకుల నిర్లక్ష్యమే దీనికి కారణం అని తెలుస్తోంది. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినప్పటికీ అభిమానులు కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదు. ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచినప్పటికీ అంతగా ఆసక్తి చూపించడం లేదు. టికెట్ విక్రయాలపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సరైన ప్రచార నిర్వహించకపోవడంతోనే అభిమానులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.. దీంతో విశాఖపట్నం ప్రాంతంలో ఐపీఎల్ కళ తప్పింది. టికెట్లు అమ్ముడుపోకపోవడం నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో అభిమానులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై మండిపడుతున్నారు. రెండు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ సరైన ప్రచారం చేయకపోవడంతోనే.. వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని వారు వాపోతున్నారు.
Also Read : ఈసారి బ్యాట్లు విరిగిపోతాయి.. బంతులు పగిలిపోతాయి..
గత సీజన్లో..
గత సీజన్లో విశాఖపట్నం స్టేడియంలో రెండు మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా పరుగుల వరద పారించింది. 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేదించడంలో ఢిల్లీ జట్టు 166 పరుగులకే కుప్ప కూలింది. ఇక మరో మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఈ మైదానంపై ఐదు వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. ఆ తర్వాత చెన్నై జట్టును 171/6 వరకే కట్టడి చేసింది. లో స్కోర్ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.. ఐతే ఈ సీజన్ లో వైజాగ్ స్టేడియాన్ని ఢిల్లీ జట్టు తన రెండవ సొంత గ్రౌండ్ గా ఎంచుకుంది. ఈ మైదానంపై లక్నో, హైదరాబాద్ జట్లపై రెండు మ్యాచ్ లు ఆడనుంది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తుంటే.. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపించడం విశేషం..” విశాఖపట్నం స్టేడియానికి ఎంతో మంచి పేరు ఉంది. గత సీజన్లో రెండు మ్యాచ్లు జరిగినప్పుడు మైదానంలో ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. టికెట్ల విక్రయానికి సంబంధించి రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రచారం నిర్వహించడంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విఫలమైంది. దీంతో టికెట్లు కొనుగోలు చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. BookMyShow, district యాప్ లలో టికెట్లు అందుబాటులో ఉంచినప్పటికీ అభిమానులు కొనుగోలు చేయడానికి ఇష్టాన్ని ప్రదర్శించడం లేదు. దేశం మొత్తం ఐపిఎల్ సందడి కొనసాగుతుంటే.. ఇక్కడ ఎందుకు విరుద్ధంగా ఉండడం నిజంగా విచారకరం. దినంతటికీ కారణం ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే. టికెట్లు అందుబాటులో ఉంచినప్పుడు ప్రచారం నిర్వహించాలి కదా. ప్రచారం నిర్వహించినప్పుడు ఏం ఉపయోగం? గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు.. గతంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినప్పుడు ప్రేక్షకులు భారీగా వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా జరిగిందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : SRH ప్లేయర్లకు భలే పేర్లు పెట్టారయ్యో..