Alto car
Alto is Coming: దేశంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కారు కొనాలని అనుకుంటే మారుతి కంపెనీ వైపే చూస్తారు. వీరికి అనుగుణంగా కంపెనీ సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అయితే దశాబ్దాలుగా మారుతి సుజుకీ కంపెనీకి చెందిన కొన్ని కార్లు సేల్స్ లో రాణిస్తున్నాయి. వీటిలో Alto ఒకటి. మిడిల్ క్లాస్ పీపుల్స్ లో బడ్జెట్ లోకారు కొనాలని అనుకునేవారు ముందుగా ఈ కారును ఎంపిక చేసుకున్నారని కంపెనీ ప్రతినిధులు చెబతుున్నారు. అయితే కాలం మారుతున్న కొద్దీ వినియోగదారులు అభిరుచులు మారుతున్నాయి. వారికి అనుగుణంగా కారును కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు మారుతి రెండు సార్లు అప్డేట్ అయింది. ఇప్పుడు మూడోసారి కొత్త తరహాలో రాబోతుంది. కొత్తగా అప్డేట్ అయిన మారుతి ఎలా ఉందంటే?
కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న ఆల్టో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడుకొని ఉంది. ఇది 48 వోల్ట్ కలిగిన ఎనర్జీ చార్జింగ్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు. దీంతో ఎక్కువ మైలేజ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కొత్త ఆల్టో కారు 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా హ్యాచ్ బ్యాక్ కార్లు 20 కిలోమీటర్ల వరకు మాత్రమే మైలేజ్ ను అందిస్తాయి. అయితే ఈ కారు అధిక ప్రయోజనాలను అందించనుంది. కొత్త ఆల్టో డిజైన్ లోనూ చాలా మార్పులు చేశారు. ఇప్పటి వరకు సాధారణ కారులా కనిపించే ఆల్టో ఇప్పుడు ఎస్ యూవీ లెవల్లో కనిపించే అవకాశం ఉంది.
ఇందులో ఆకర్షణీయమైన హెడ్ లైట్లు అమర్చనున్నారు. అలాగే గ్రిల్, బంపర్ వీల్స్ ను చేర్చనున్నారు. స్టైలిష్ గా కనిపించే రూపంతో ఆల్టో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఆల్టో కోసం ఎదరుచూసేవారు.. ఈ కారును ఎంచుకోవచ్చని అంటున్నారు. అయితే ఇంజిన్ విషయంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ధర కూడా కాస్త పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
2026లో జపాన్ మార్కెట్లోకి రాబోతున్న కొత్త ఆల్టోను రూ.5.83 లక్షల ప్రారంభ ధరతో పాటు రూ.6.65 లక్షల వరకు విక్రయంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. అయితే భారత్ లోకి ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇది ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వగానే అమ్మకాల జోరందుకుంటుందని అంటున్నారు. దేశీయంగా మారుతి కార్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆల్టో బెస్ట్ ఎంపిక అవుతుందని చెబుతున్నారు. మరి ఈ కారు ఎలా ఉండబోతుందో చూడాలి.