https://oktelugu.com/

IPL trophy 2025 : ఈసారి బ్యాట్లు విరిగిపోతాయి.. బంతులు పగిలిపోతాయి..

IPL trophy 2025 : తొలి మ్యాచ్ కోల్ కతా(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది..కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ (Eden gardens) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు.

Written By: , Updated On : March 21, 2025 / 10:34 AM IST
IPL trophy 2025

IPL trophy 2025

Follow us on

IPL trophy 2025 : తొలి మ్యాచ్ కోల్ కతా(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది..కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ (Eden gardens) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. గత సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టును ఓడించింది. అయితే ఈసారి అన్ని జట్లు బలంగా ఉన్నాయి. ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. దీంతో అన్ని జట్ల మధ్య పోటీ హోరా హోరిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రాక్టీస్ లో మాత్రం అన్ని జట్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి. బౌలర్లు బంతిమీద పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. బ్యాటర్లు పరుగులు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈసారి భిన్నంగా సొంత బౌలర్లతో మ్యాచ్ లు ఆడుతూ బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు..

Also Read : SRH ప్లేయర్లకు భలే పేర్లు పెట్టారయ్యో..

బ్యాట్లు విరిగిపోతాయి.. బంతులు పగిలిపోతాయి..

ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్న ఆటగాళ్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా మైదానంలోనే గడుపుతున్నారు. రకరకాల బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నారు. విభిన్నమైన పిచ్ లపై ఆడుతున్నారు.. అయితే బెంగళూరు జట్టు ఆటగాళ్లు తమ బౌలర్లతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఏకంగా 320 మించి పరుగులు చేశారు. ఇక హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కూడా సొంత బౌలర్లతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. హైదరాబాద్ ఆటగాళ్లు కూడా 300కు మించి పరుగులు చేశారు.. ముంబై, లక్నో, ఢిల్లీ, కోల్ కతా జట్ల ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లలో భారీగా పరుగులు చేశారు. ” ప్రాక్టీస్ మ్యాచ్లలో అన్ని జట్ల ఆటగాళ్లు బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. బంతులు పగిలే విధంగా కొట్టారు. బ్యాట్లు విరిగేలాగా బ్యాటింగ్ చేశారు. ఈసారి చూస్తే 300 నుంచి పరుగులు నమోదయ్యే అవకాశం అనిపిస్తోంది. ఎందుకంటే ఆటగాళ్ల జోరు ఆ విధంగా ఉంది. చూడాలి ఏం జరుగుతుందోనని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరు, ముంబై జట్లతో జరిగిన మ్యాచ్లలో శివతాండవం చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. మరి ఈసారి హైదరాబాద్ జట్టు తరుపున హెడ్, అభిషేక్ శర్మ భారీగా పరుగులు చేస్తారని అభిమానులు అంచనాలు చేస్తున్నారు. మరి ఈసారి వారు ఎలాంటిఆట తీరు ప్రదర్శిస్తారో వేచి చూడాల్సి ఉంది.. ఇక గత సీజన్లో బెంగళూరు ఆటగాళ్లు కూడా దుమ్మురేపారు. విరాట్ కోహ్లీ హైయెస్ట్ స్కోరర్ గారు నిలిచాడు. మరి ఈసారి అతడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. ఇక బౌలర్ల పరంగా కూడా అద్భుతాలు చేసేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. ఇక రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎటువంటి రికార్డులు నమోదవుతాయో చూడాల్సి ఉంది.

Also Read : ఐపీఎల్ రూల్స్ మారుతున్నాయి.. బౌలర్లకు వికెట్ల పండగే