https://oktelugu.com/

IPL 2025: మూడు ముక్కల్లో ఐపీఎల్ గురించి కెప్టెన్లు చెప్పేశారు!

IPL 2025 శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వాహక కమిటీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని సరికొత్త విధానంలో చేపట్టడం మొదలుపెట్టింది.

Written By: , Updated On : March 22, 2025 / 10:30 AM IST
IPL 2025 (8)

IPL 2025 (8)

Follow us on

IPL 2025: ఐపీఎల్ లో ఈసారి చాలా జట్లకు కెప్టెన్లు మారారు. గతంలో లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉండేవాడు. ఇప్పుడు అతడు ఢిల్లీ జట్టుకు వెళ్ళిపోయాడు. లక్నో జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ సారథ్యం వహిస్తున్నాడు. కోల్ కతా జట్టుకు గతంలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు ఆ జట్టుకు అజింక్య రహనే సారథ్యం వహిస్తున్నాడు.. బెంగళూరుకు గతంలో డు ఫ్లెసిస్ నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు ఆ జట్టుకు రజత్ పాటిదార్ సారథ్యం వహిస్తున్నాడు. కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు గతంలో శిఖర్ ధావన్ నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్, చెన్నై, ముంబై జట్లకు సంబంధించి కెప్టెన్ల విషయంలో ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదు.. చెన్నై జట్టుకురుతురాజ్ గైక్వాడ్, ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా, హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నారు.

 

Also Read: కోల్ కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగేది అనుమానమే..

కెప్టెన్లు ఏమన్నారంటే..

శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వాహక కమిటీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని సరికొత్త విధానంలో చేపట్టడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా పది జట్లకు సంబంధించిన కెప్టెన్లతో మాటామంతి చేపట్టింది. ఇందులో భాగంగా 10 జట్లకు సంబంధించిన కెప్టెన్లు ఐపీఎల్ 18వ ఎడిషన్ పై తమ మనోగతాన్ని వెల్లడించారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు.. ఐపీఎల్ అనేది ఉత్కంఠ భరితమైన క్రికెట్ కు చిరునామా అని ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ప్రతి ఓవర్ కూడా మ్యాచ్ మలుపునకు కారణం అవుతుందని హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ అభిప్రాయ పడ్డాడు. ఉర్రూతలూగించే ఉత్సాహానికి ఐపీఎల్ చిరునామా అని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. క్రికెట్ ను అద్భుతంగా ఆస్వాదించాలంటే ఐపిఎల్ లో మాత్రమే సాధ్యమవుతుందని లక్నో కెప్టెన్ పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ద్వారా క్రికెట్ సరికొత్త పుంతలు తొక్కిందని ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ వివరించాడు.. ఐపీఎల్ ఆటగాళ్లకు స్వర్గధామం లాంటిదని కోల్ కతా కెప్టెన్ అజింక్య రహనే వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ ద్వారా ప్లేయర్ల శక్తిసామర్థ్యాలు బయటపడతాయని చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ అభిమానులతో పాటు.. ఆటగాళ్లకు కూడా వినోదాన్ని అందిస్తుందని బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిధార్ వివరించాడు. ఐపీఎల్ తో క్రికెట్ అనేది శిఖర స్థాయిని అందుతుందని గుజరాత్ కెప్టెన్ గిల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ అనేది క్రికెట్ కు మరింత గుర్తింపు తీసుకొచ్చిందని.. ఇందులో అనుక్షణం ఉత్కంఠ ఉంటుందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వివరించాడు.

 

Also Read: మండే ఎండల్లో.. మస్తు క్రికెట్ మజా..