Action-movie
Action Movie: తెలుగు సినియాల్లో యాక్షన్ తో కూడుకొన్నవి అంటే కొంత మందికి చాలా ఇష్టం. అందుకే ఆ సినిమాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు రికార్డు స్థాయిలో ఆడాయి. ఈ సినిమాల్లో నటీ నటుల యాక్షన్ తో పాటు వాహనాలు కూడా ప్రముఖంగా నిలుస్తాయి. వీటిలో ప్రత్యేకంగా టాటా సుమోల గురించి చెప్పుకోవచ్చు. వందల కొద్దీ టాటా సుమోలు కొన్ని సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాయి. అలా ప్రఖ్యాతి పొందిన TaTa SUMO ఇప్పుడు మళ్లీ రాబోతుంది. అదెలా ఉండబోతుందంటే?
1994లో TaTa కంపెనీకి చెందిన SUMO 10 సీట్ల SUV మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో ఎస్ యూవీల పోటీ తక్కువగా ఉండడంతో చాలా మంది దీనిని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో 1997 వరకు ఇవి లక్ష వరకు విక్రయించబడ్డాయి. ఆ తరువాత వివిధ వేరియంట్లలో వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు కొత్త తరహాలో రాబోతుంది. అప్పటి సుమో దేశీయంగా అత్యంత పాపులారిటీ సాధించుకుంది. ఇప్పుడు కొత్త సుమోను కూడా ఆదరిస్తారనే నమ్మకంతో కంపెనీ కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టబోతుంది. తక్కువ ధరతో పాటు మంచి ఫీచర్ కలిగిన ఈ వాహనం ఎలా ఉందంటే?
కొత్త టాటా సుమోలో 7 లేదా 9 సీట్లు ఉండే అవకాశం ఉంది. నేటి కాలంలో చాలా మంది MPV కోరుకుంటున్నారు. అందువల్ల దీనిని ఆ వేరియంట్ లో తీసుకురావాలని చూస్తున్నారు. కొత్త సుమోలో రెండు పవర్ ట్రెయిన్లు ఉండనున్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను చేర్చనున్నారు. ఇందులో టచ్ స్క్రీన్ తో పాటు ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు ఎయిర్ కండిషనర్, మ్యూజిక్ సిస్టమ్ ను అమర్చనున్నారు. ఆకట్టుకునే డిజైన్ కూడా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.
కొత్త వాహనం లీటర్ ఇంధనంపై 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో డ్రైవర్ డిస్ ప్లేతో పాటు డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ ఏసి, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉండనున్నాయి.అలాగే సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ను చేర్చనున్నారు. అలాగే 360 డిగ్రీ కెమెరాతో సెక్యూరిటీ ఇవ్వనుంది. ఇక ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని అంటున్నారు.
ఒకప్పుడు యాక్షన్ సినిమాల్లో ఈ కారు కనిపించిన తరువాత దీని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే ప్రస్తుతం కాలంలో ఎస్ యూవీలు చాలా వరకు మార్కెట్లోకి వచ్చాయి. కానీ వాటి ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లో బడ్జెట్ లో ఎస్ యూవీని తీసుకురావడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టాటా సుమో కొత్త వాహాన్ని తీసుకు రాబోతుంది. అయితే దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు.