IPL trophy 2025
IPL trophy 2025 : ఐపీఎల్ లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు జట్లను నిర్వహిస్తూ ఉంటాయి. అదే స్థాయిలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మెగా వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేస్తుంటాయి. మినీ వేలంలోనూ తమకు నచ్చిన ఆటగాళ్లను సొంతం చేసుకుంటాయి. ప్రసార హక్కులు.. ప్రకటనలు.. ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను పొందుతుంటాయి. ఈ స్థాయిలో ఆదాయం ఉంది కాబట్టే అన్ని జట్ల యాజమాన్యాలు ఐపీఎల్ అనగానే ఆసక్తి చూపిస్తుంటాయి. మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసి.. ఛాంపియన్లుగా నిలవాలని భావిస్తుంటాయి. ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వస్తూ ఉంటుంది. ఐపీఎల్ లో ఐదు సార్లు సంయుక్తంగా గెలిచి చెన్నై, ముంబై జట్లు అత్యంత విలువైనవిగా పేరుపొందాయి. ఈ జట్ల మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆడే ఆటగాళ్లు కూడా భారీగానే సంపాదించారు. సంపాదిస్తూనే ఉన్నారు.
Also Read : షారుక్ వ్యాఖ్యానం.. శ్రేయ గాత్రం.. దిశా నాట్యం.. అదిరిపోయిన ఆరంభ వేడుకలు..
కనుసన్నల్లో బెట్టింగ్..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. వారిపై కేసులు కూడా నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ పై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వాటి అకౌంట్లను ఇప్పటికే ఫ్రీజ్ చేసింది. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రతిపక్ష శివసేన (UBT) నేత అంబదాస్ దాన్వే శాసనమండలిలో సంచలన ఆరోపణలు చేశారు..” ముంబై పోలీసుల కనుసన్నల్లో భారీగా బెట్టింగ్ సాగుతోంది. నా వద్ద ఉన్న పెన్ డ్రైవ్ లో ఆధారాలు ఉన్నాయి. వాటిని త్వరలో బయటపెడతాను. పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి కొంతమంది ఐపిఎల్ బెట్టింగ్లో పాల్గొంటున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ల తో వారు టచ్ లో ఉంటున్నారు. ఇలాంటి ముఠా పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. వారితోనే అంట కాగుతున్నారు. బెట్టింగ్ ముఠా అమాయకులైన ప్రజలను మోసం చేస్తోంది. ఐపీఎల్ ను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలను సంపాదిస్తోంది. దీనివల్ల చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు.. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనాన్ని.. బెట్టింగ్ చేసే విధానాన్ని రూపుమాపాల్సిన పోలీసులు ఇలా చేయడం దారుణం. త్వరలోనే వివరాలను మొత్తం బయట పెడతాను. వారదరి పై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టాలని” అంబదాస్ అన్నారు. అంబదాస్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. ఆయన పెన్ డ్రైవ్ లో ఎవరి పేర్లు ఉన్నాయి.. ఆయన వద్దకు ఆధారాలు ఎలా లభించాయి.. పోలీసులు మాత్రమేనా బెట్టింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణాలలో జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది. మరి ఈ విషయం ఎక్కడ దాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది. ఐపీఎల్ నడుస్తున్నప్పుడు బెట్టింగ్ కొత్తగాక పోయినప్పటికీ.. పోలీసుల కనుసన్నల్లో ఇది జరుగుతోంది అని బయటకు చెప్పడమే ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా..