Today horoscope in telugu
‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సిద్ధయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్తగా పెట్టుబడిలో పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు అధికారుల సహకారం ఉంటుంది. అవసరపు వివాదాల్లో తల దూర్చవద్దు. ఎవరి మీద అయినా అయినా కోపం తెచ్చుకోవద్దు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల సలహా మేరకు కొత్తగా పెట్టుబడులు పెడతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. గతంలో వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. స్నేహితుల సహాయంతో వీటిని పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి పురోగతి సాధిస్తుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సమకూరుతుంది. అయితే ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఎవరితోనైనా మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒకరి కారణంగా వివాదం నెలకొంటుంది. అయితే మాటలు మాధుర్యంతో ఈ సమస్యను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. బంధువుల్లో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాపారులకు శత్రువుల పెడితే ఎక్కువగా ఉంటుంది. కొత్త వారితో ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి. స్నేహితులతో కలిసి వ్యాద యాత్రలకు వెళ్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగుంటుంది. అయితే కొన్ని ఖర్చుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్తవారితో ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఈ సమయంలో డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యుల సపోర్టుతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఆశించిన లాభాలు పొందుతారు. ప్రతి విషయాన్ని వివాదం చేయకుండా సంతోషంగా జీవించే ప్రయత్నం చేయాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. భవిష్యత్తులో జరిగే శుభకార్యం కోసం తీవ్రంగా చర్చిస్తారు. ఇంకా ఒకరికి అనారోగ్య సమస్య వస్తుంది. ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈ రోజు లాభాలు అధికంగా ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకరి ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. నైపుణ్యాలు ప్రదర్శించడం వల్ల ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటే నేటితో అవి పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి గౌరవం పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త మిత్రులతో వ్యాపారాలను నిర్వహిస్తారు. ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే వెంటనే తిరిగి వస్తుంది. దీంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తుందని కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే ఈరోజు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. తల్లిదండ్రుల సలహా మేరకు వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. పిల్లల కెరీర్ పైకి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసే ఒక కార్యక్రమం విజయవంతం అవుతుంది. మందుల నుంచి ధన సహాయం అందుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . వ్యాపారులు ఆర్థిక వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో ఒప్పందాలు చేసేటప్పుడు ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఉద్యోగులు పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళనతో ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే దానిని పరిష్కరించుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. అయితే ఇవి లాభాలని తీసుకొస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.