https://oktelugu.com/

IPL Trophy 2025: షారుక్ వ్యాఖ్యానం.. శ్రేయ గాత్రం.. దిశా నాట్యం.. అదిరిపోయిన ఆరంభ వేడుకలు..

IPL Trophy 2025 : ఐపీఎల్ 18 ఎడిషన్ ప్రారంభ వేడుకలను నిర్వాహక కమిటీ ఆకాశమే హద్దుగా నిర్వహించింది. శనివారం సాయంత్రం 6:30 నిమిషాలకు మొదలైన ప్రారంభ వేడుకలు ఆసాంతం అట్టహాసంగాసాగాయి.

Written By: , Updated On : March 22, 2025 / 07:42 PM IST
IPL 2025 Opening ceremony

IPL 2025 Opening ceremony

Follow us on

IPL Trophy 2025 : ప్రారంభ వేడుకలను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Bollywood Badshah Shahrukh Khan) ప్రారంభించారు.. ప్రఖ్యాత సింగర్ శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) తన పాటలతో ఆకట్టుకున్నారు. ఆమీ ఝే తోమర్ పాటతో శ్రేయ ప్రారంభ వేడుకలను ప్రారంభించారు. మా తు ఝే సలాం అనే పాటతో తన పాటల విభావరిని శ్రేయ ముగించారు. ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించిన శ్రేయ.. పది జట్లకు అంకితం ఇచ్చారు. శ్రేయ పాడుతున్నప్పుడు ఆడియో క్లారిటీ సరిగా లేకపోవడంతో అభిమానులు అరుపులు.. కేకలతో నిర్వాహక కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దిశాపటాని(Disha patani) వేదిక మీద ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాకతో ఒకసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. ఆమె పలు హిందీ పాటలకు చిందులు వేసింది. ఇక ప్రముఖ ర్యాపర్ కరణ్ ఆజ్లా (Karan aujla) తన పాటలతో ఆకట్టుకున్నాడు.

Also Read : భీకరమైన ఫామ్ లో ఉన్నారు..ఈ యువ ఆటగాళ్లు ఈసారి ఏం చేస్తారో..

షారుక్ ఖాన్ హోస్ట్ గా..

ఈ వేడుకలకు షారుఖ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bengaluru) ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)ని వేదిక మీదికి ఆహ్వానించాడు.. 18 సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని.. అతడు గొప్ప ఆటగాడని.. అతడు ఇలాంటి ఇన్నింగ్స్ మరిన్ని ఆడాలని ఆకాంక్షించాడు. అతడు పరుగుల యంత్రమని ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీతో షారుఖ్ ఖాన్ సరదాగా మాట్లాడాడు. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders) జట్టు సంచలన ఆటగాడు రింకు సింగ్ (Rinku Singh) ను వేదిక మీదికి పిలిచాడు..” విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఆటగాళ్లకు మీరు పోటీ ఇస్తారా” అని రింకూ సింగ్ ను షారుక్ ఖాన్ ప్రశ్నించాడు..” నేను ఈ తరం ఆటగాడిని. వారు ఎప్పుడు పాత తరం ఆటగాళ్లు కాదు. వారిని చూసి ప్రతి సందర్భంలో స్ఫూర్తి పొదుతూనే ఉంటానని”రింకూ సింగ్ బదులిచ్చాడు. ఇక రింకు సింగ్ తో కలిసి షారుక్ ఖాన్ డాన్స్ వేశాడు. వారిద్దరిని చూసి విరాట్ కోహ్లీ పడి పడి నవ్వాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా షారుక్ ఖాన్ తో కలిసి డాన్స్ వేశాడు. ఇక బిసిసిఐ పెద్దలతో పాటు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వివిధ సెలబ్రిటీలను షారుక్ ఖాన్ వేదిక మీద ఆహ్వానించారు..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహనే, రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ రజత్ పాటిదర్ ట్రోఫీని వేదిక మీద తీసుకొచ్చారు. బీసీసీఐ పెద్దలు వేదిక మీద ఏర్పాటు చేసిన అతిపెద్ద భారీ కేక్ ను కట్ చేశారు. ఒకరికి ఒకరు తినిపించుకున్నారు తద్వారా ఐపీఎల్ 2025 సీజన్ ను ఘనంగా ప్రారంభించినట్టు సంకేతాలు ఇచ్చారు. చివరికి జాతీయ గీతంతో ప్రారంభం వేడుకలను ముగించారు.

Also Read : ఈసారి ఐపీఎల్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే