Today Google Doodle
IPL Trophy 2025 : అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో జస్ట్ ఒక టచ్ దూరంలో ప్రపంచాన్ని చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకుంటున్నాం. అయితే మనకు తెలియని విషయం గురించి శోధించాలంటే వెంటనే మన చేతులు, కళ్లు ఆశ్రయించేది గూగుల్ నే. గూగుల్లో దొరకని సమాచారం అంటూ ఉండదు. అందువల్లే గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక పరిజ్ఞాన సంస్థగా ఎదిగింది. గూగుల్లో ఉన్న సమాచారాన్ని ప్రింట్ అవుట్లు తీస్తే ఆ పేజీలను ప్రపంచం మొత్తం మీద రెండుసార్లు పరచవచ్చంట. ఇక గూగుల్ కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు.. కొత్త కొత్త విషయాలను యూజర్లకు పరిచయం చేస్తూ ఉంటుంది. అందులో ప్రముఖమైనది డూడుల్.. గూగుల్ సెర్చ్ ఆప్షన్ దగ్గర ఇది కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇది మారుతూ ఉంటుంది. దేశాన్ని బట్టి డూడుల్ ను గూగుల్ క్రియేట్ చేస్తుంది.
Also Read : ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ విన్నర్స్ వీరే..
ఐపీఎల్ ఫీవర్ తో..
దేశ మొత్తం ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ లో ఉంది. పది జట్లు పోటీపడుతున్న ఈ రిచ్ క్రికెట్ లీగ్ ను దాదాపు మే నెల వరకు బిసిసిఐ నిర్వహిస్తుంది. తొలి మ్యాచ్ మార్చి 22న కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 నుంచి షురూ అవుతుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18 లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని గూగుల్ కూడా సరికొత్తగా ముస్తాబయింది.. తన డూడుల్ ను సరికొత్తగా రూపొందించింది.. డూడుల్ ను క్రికెట్ మైదానంగా రూపొందించింది.. రెండు బాతులు క్రికెట్ ఆడుతున్నట్టు.. క్రికెట్ అంటే వాటికి అమితమైన ఇష్టం ఉన్నట్టు రూపొందించింది..ఈ డూడుల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. శనివారం పోటీపడుతున్న కోల్ కతా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు ఐపీఎల్ లో 34 మ్యాచులు జరిగాయి. ఇందులో కోల్ కతా 20 సార్లు గెలిచింది.. బెంగళూరు 14 సార్లు విజయాన్ని సాధించింది.. ఇక గత సీజన్లో బెంగళూరు, కోల్ కతా రెండుసార్లు పోటీ పడినప్పటికీ.. రెండుసార్లు కూడా కోల్ కతా విజయం సాధించింది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు ఐపిఎల్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది. 2012 తర్వాత.. ఇప్పుడు మళ్లీ విజేతగా నిలిచింది. ఈసారి కోల్ కతా జట్టుకు అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే నాయకత్వం వహిస్తున్నాడు.
Also Read : మరోసారి ప్రత్యేకతను చాటుకున్న గూగుల్..ఈసారి డూడుల్ గా దేన్ని రూపొందించిందంటే..