ఐపీఎల్: ఈ సండే మళ్లీ ఏమైంది?

వీకెండ్‌ వచ్చిందంటే ఎవరికైనా మజాయే.. అందులోనూ ఇప్పుడు ఐపీఎల్‌ సీజన్‌ కూడా నడుస్తోంది. ఇంకే వీకెండ్‌ వచ్చిందంటే క్రికెట్‌ చానల్‌ పెట్టుకొని క్రికెట్‌ అభిమానులు మజా చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా మ్యాచ్‌లు నడుస్తూనే ఉన్నాయి. అయితే.. గత ఆదివారాల్లో జరిగిన అన్ని మ్యాచ్ లు ఆసక్తికి.. ఉత్కంఠను కలిగించాయి. Also Read: చెన్నై రిటర్న్‌ బ్యాక్.. జీర్ణించుకోలేకపోతున్న ధోని ఫ్యాన్స్ నిన్న ఆదివారం. అందులోనూ దేశమంతా దసరా సంబురాల్లో ఉంది. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా […]

Written By: NARESH, Updated On : October 26, 2020 4:48 pm
Follow us on

వీకెండ్‌ వచ్చిందంటే ఎవరికైనా మజాయే.. అందులోనూ ఇప్పుడు ఐపీఎల్‌ సీజన్‌ కూడా నడుస్తోంది. ఇంకే వీకెండ్‌ వచ్చిందంటే క్రికెట్‌ చానల్‌ పెట్టుకొని క్రికెట్‌ అభిమానులు మజా చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా మ్యాచ్‌లు నడుస్తూనే ఉన్నాయి. అయితే.. గత ఆదివారాల్లో జరిగిన అన్ని మ్యాచ్ లు ఆసక్తికి.. ఉత్కంఠను కలిగించాయి.

Also Read: చెన్నై రిటర్న్‌ బ్యాక్.. జీర్ణించుకోలేకపోతున్న ధోని ఫ్యాన్స్

నిన్న ఆదివారం. అందులోనూ దేశమంతా దసరా సంబురాల్లో ఉంది. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా రసవత్తరంగా జరుగుతుందని అందరూ అనకున్నారు. కానీ.. ఈ ఆదివారం జరిగిన మ్యాచ్‌లు చప్పగా సాగాయి. జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లు విజయ సాధించాయి. స్కోర్ ఎంత అనే చూడకుండా బ్యాట్స్‌మెన్లు ఎడాపెడా బాదేశారు. తమ జట్లకు విజయాలను అందించారు. ఈ క్రమంలో అలవోకగా సిక్సర్లు బాదేశారు. సెంచరీలు కొట్టేశారు.

ఇప్పటికే ఈ ఐపీఎల్‌లో తిరుగులేని ప్రతిభ చాటుతున్న ముంబైకి రాజస్థాన్‌ షాక్‌ ఇచ్చింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. తమదే గెలుపని అనుకుంది. కానీ.. బెన్ స్టోక్స్ ఇచ్చిన స్ట్రోక్స్‌తో సీన్ మారిపోయింది. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుండి బాదుడే బాదుడు.. 60 బంతుల్లోనే 107 పరుగులు చేసి మ్యాచ్‌ అయిపోయే వరకూ ఔట్ కాలేదు. స్టోక్స్‌కు శాంసన్ తోడయ్యాడు. దీంతో 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో పది బంతులు మిగిలి ఉండగానే సాధించేసింది. అంతకుముందు ముంబై 195 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అందులో హార్దిక్‌ పాండ్య 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.

Also Read: చెన్నై ఫ్యాన్స్ భావోద్వేగం.. గెలిచినా-ఓడినా CSKతోనే..!

ఈ మ్యాచ్‌ ఇలా ఉంటే.. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ చేజింగ్ టీమ్‌నే విజయం వరించింది. బెంగళూరు జట్టు విధించిన 146 పరుగుల లక్ష్యాన్ని తడబడకుండానే ఛేదించింది చెన్నై. గత మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో ఈ స్వల్ప లక్ష్యమైనా సాధిస్తుందా లేదా అని అందరూ అనుమానపడ్డారు. అయితే.. రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు నిలకడగా ఆడడంతో విజయం సాకారమైంది. మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు.. మొదట బ్యాటింగ్ ఎంచుకుని పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ఆచితూచి ఆడారు. 15 ఓవర్ల తర్వతా ఆ జట్టు స్కోరు 101 మాత్రమే ఉంది. చివరికి చెన్నై గట్టెక్కినా పెద్దగా ప్రతిఫలం కనిపించలేదు. ప్లేఆఫ్‌ ఆశలు మిస్‌ అయినట్లేనని తెలుస్తోంది.