పిల్ల దొరక లేదు గానీ.. పెళ్లికి రెడీ అంటున్న తేజు.. !

మెగా ఇంట్లో మరోసారి పెళ్లిభజా మోగనుంది. ఇప్పటికే మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇటీవల నిశ్చితార్థం వేడుక జరుగగా మెగా హీరోలంతా హాజరై సందడి చేశారు. త్వరలోనే పెళ్లి డేట్ ను నాగబాబు అనౌన్స్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజుకు పెళ్లికి రెడీగా ఉన్నట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. Also Read: ట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా? సాయిధరమ్ తేజు ప్రస్తుతం ‘సోలో లైఫ్ […]

Written By: NARESH, Updated On : October 26, 2020 5:15 pm
Follow us on

మెగా ఇంట్లో మరోసారి పెళ్లిభజా మోగనుంది. ఇప్పటికే మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇటీవల నిశ్చితార్థం వేడుక జరుగగా మెగా హీరోలంతా హాజరై సందడి చేశారు. త్వరలోనే పెళ్లి డేట్ ను నాగబాబు అనౌన్స్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజుకు పెళ్లికి రెడీగా ఉన్నట్లు ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: ట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా?

సాయిధరమ్ తేజు ప్రస్తుతం ‘సోలో లైఫ్ సో బెటర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల సాయిధరమ్ తేజు పెళ్లిపై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సాయిధరమ్ తేజు తన పెళ్లిపై వార్తలపై అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

తాజాగా తేజు మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పాడు. తాను సైతం పెళ్లి సంబంధాలు చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపాడు. ఇంట్లో వాళ్లంతా తనకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోవడంతోనే తాను పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. మంచి సంబంధం.. అమ్మాయి బాగుంటే చేసుకుంటానని మాత్రమే వారికి చెప్పానని చెప్పాడు.

మీడియాలో వస్తున్నట్లు ప్రేమ వ్యవహారాలు ఏమిలేవని స్పష్టం చేశాడు. తనది పెళ్లి కుదిర్చిన సంబంధమే అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారని.. అమ్మాయి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తేజు చెప్పుకొచ్చాడు. దీంతో తనపై పెళ్లిపై వస్తున్న ఊహగానాలకు తేజు చెక్ పెట్టినట్లయింది.

Also Read: ప్రభాస్ కు ధీటుగా దీపిక పాత్ర ఉండనుందా?

సాయిధరమ్ కొత్త సినిమా సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా తేజు సోలో డేస్ కు ఎండ్ కార్డు పడుతుందంటూ ట్వీట్ చేశాడు. దీంతో చిరంజీవి కూడా తేజుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామనే క్లారిటీ ఇచ్చాడు. తేజు సైతం నిజమేనంటూ నవ్వుతూ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో త్వరలోనే మెగా ఇంట్లో మరో పెళ్లిభజా మోగుతుందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.