IPL team owners background: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. ప్రారంభంలో దీని విలువ వేలకోట్లుగా ఉంది. ఇప్పుడు దీని విలువ ఏకంగా 1,50,000 కోట్లు దాటేసింది. భవిష్యత్తు కాలంలో ఐపీఎల్ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్లే పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల యజమానులు క్రికెట్ క్రీడలోకి ప్రవేశించారు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తర్వాత.. క్రికెట్ లోకి అడుగుపెట్టారు.
ఐపీఎల్ లో ఐదుసార్లు చెన్నై, ఐదుసార్లు ముంబై విజేతలుగా నిలిచాయి.కోల్ కతా నైట్ రైడర్స్ మూడుసార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ రెండుసార్లు, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకసారి ట్రోఫీని అందుకున్నాయి. ఇటీవల బెంగళూరు, రాజస్థాన్ జట్లు చేతులు మారాయి. వీటి డీల్ విలువ వేల కోట్లుగా నమోదయింది. దీనినిబట్టి ఐపీఎల్ విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత విలువైన జట్లలో ముంబై, చెన్నై జట్లు కోన సాగుతున్నాయి. ఎందుకంటే ఇవి ఐదేసి సార్లు ట్రోఫీలను అందుకున్నాయి.
ఐపీఎల్ లో పది జట్లు ఉన్నాయి. ఈ జట్ల యాజమాన్యాల నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. చెన్నై జట్టుకు యజమానిగా ఎన్ శ్రీనివాసన్ కొనసాగుతున్నారు. ఈయన సిమెంట్ వ్యాపారంలో ఉన్నారు. గతంలో భారత క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ముంబై ఇండియన్స్ జట్టుకు యజమానులుగా అంబానీ కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. అంబానీ కుటుంబ సభ్యులలో ముఖేష్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చైర్మన్ గా ఉన్నారు. ఈయన ప్రవేశించని వ్యాపారం అంటూ లేదు. జంతువుల సంరక్షణ నుంచి మొదలు పెడితే పెట్రోలియం వరకు అన్ని వ్యాపారాలు చేస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు యజమానియా షారుక్ ఖాన్, జుహీ చావ్లా కొనసాగుతున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ లో పేరుపొందిన నటులు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కింద ఈ జట్టును వారు నిర్వహిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా కళానిధి మారన్ కొనసాగుతున్నారు. ఈయన గతంలో దక్కన్ చార్జర్స్ జట్టును కొనుగోలు చేశారు. సన్ టీవీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ జట్టును ఆయన కొనసాగిస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టుకు యజమానులుగా ప్రీతి జింటా, వాడియా గ్రూప్, మోహిత్ బర్మన్ కొనసాగుతున్నారు. కెపిహెచ్ డ్రీమ్ క్రికెట్ లిమిటెడ్ కంపెనీ కింద ఈ జట్టును నిర్వహిస్తున్నారు.. రాజస్థాన్ రాయల్స్ ను కల్ సోమని అనే అమెరికా వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. గతంలో ఈ జట్టుకు మనోజ్ బదాలే యజమానిగా ఉన్నారు. పదిహేను వేల కోట్లకు ఇటీవల ఈ జట్టును సోమని కొనుగోలు చేశారు.. లక్నో జట్టుకు యజమానియా సంజీవ్ గోయంక కొనసాగుతున్నారు. ఈయన ఆర్పీ సంజీవ్ గోయంక గ్రూప్ ను నిర్వహిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు యజమానులుగా సివిసి క్యాపిటల్స్, టొరెంట్ గ్రూప్ కొనసాగుతున్నాయి.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యజమానియా పార్థ జిందాల్ ఉన్నారు. ఈయన జే ఎస్ డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలో సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.