Homeఎంటర్టైన్మెంట్Venkatesh new movie update: వెంకటేష్ లైనప్ లోకి వచ్చిన మరో స్టార్ డైరెక్టర్...

Venkatesh new movie update: వెంకటేష్ లైనప్ లోకి వచ్చిన మరో స్టార్ డైరెక్టర్…

Venkatesh new movie update: ‘విక్టరీ వెంకటేష్’ చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన డిఫరెంట్ సినిమాలను చేసినప్పటికి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ ఉందంటే మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా ఆయన వెనకాడడం లేదు. ఇక అలాంటి వెంకటేష్ ఇప్పుడు వరుస […]

Venkatesh new movie update: ‘విక్టరీ వెంకటేష్’ చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన డిఫరెంట్ సినిమాలను చేసినప్పటికి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ ఉందంటే మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా ఆయన వెనకాడడం లేదు. ఇక అలాంటి వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలతో సక్సెస్ లను సాధించడానికి ముందుకు దూసుకెళ్తున్నాడు. గత సంవత్సర సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాడు. విక్టరీ వెంకటేష్ పేరుకు తగ్గట్టుగానే వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకపక్క కామెడీ చేస్తూనే ఎమోషనల్ సన్నివేశాలలో సైతం అదరగొడుతూ ప్రేక్షకులందరిని మెప్పించగలిగే కెపాసిటి కూడా అతనికే చెల్లింది. ఆయన లాంటి హీరో ఇండస్ట్రీలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా మరోక సినిమాకి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది…

తమిళంలో సూపర్ హిట్ సినిమాలను చేసి వెంకటేష్ తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అనే సినిమా చేసి సక్సెస్ ను అందించిన శ్రీ రాఘవ డైరెక్షన్ లో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడట…ఇక ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది… మొత్తానికైతే వెంకటేష్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమవుతున్నాడు.

తొందరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని కూడా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో మరోసారి తన కామెడీ టైమింగ్ ని మనం చూడొచ్చు అని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికైతే వెంకటేష్ మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందపరిచే విషయమనే చెప్పాలి… ఇప్పటివరకు విక్టరీ వెంకటేష్ సాధించిన విజయాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి.

కాబట్టి ఇక మీదట ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తే బాగుంటుందని పలువురు అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయం మీద వెంకటేష్ ఏం ఆలోచిస్తున్నాడు. తొందరలోనే పాన్ ఇండియా ప్రాజెక్టు చేస్తాడా? తన అభిమానుల కోరికను నెరవేరుస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper