Homeబిజినెస్Dell 15 laptop price in India: మార్కెట్లోకి Dell 15.. చూస్తే విడిచిపెట్టరు.. ధర...

Dell 15 laptop price in India: మార్కెట్లోకి Dell 15.. చూస్తే విడిచిపెట్టరు.. ధర గురించి తెలుసుకోండి..

Dell 15 laptop price in India: కొత్త laptop కొనాలని చూసేవారికి Dell కంపెనీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న వాటికంటే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా లాప్టాప్ అవసరం ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ కొత్త లాప్టాప్ రెండు కలర్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఉండే ఫీచర్లు, బ్యాటరీ వ్యవస్థ, ధర ఏవిధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.

Dell కంపెనీ నుంచి ఇటీవల 15 అనే మోడల్ రిలీజ్ అయింది. ఈ లాప్టాప్ లో ఇంటెల్ కోర్ ఆల్ట్రా ప్రాసెసర్ ఉండనుంది. ఈ ప్రాసెసర్ తో వేగంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనిని రెండు రకాల ప్రాసెసర్ మోడల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఒకటి ఇంటెల్ కోర్ ఆల్ట్రా 7255 H ఉండగా.. మరొకటి ఇంటెల్ కోర్ ఆల్ట్రా 5225 H ఉంది. మరొకటి హై ఎండ్ మోడల్ అయినా 16 కోర్ సిపియు కూడా అందుబాటులో ఉంది.డెల్ 15 లాప్టాప్ లో 8 GB రామ్ సపోర్ట్ చేయనుంది. కావలసిన ఫైల్స్ తో పాటు అత్యధికంగా వీడియోలు స్టోర్ చేసుకోవడానికి ఈ లాప్టాప్ లో 512 జీబీ స్టోరేజ్ కోసం అవకాశం ఇచ్చారు.

డెల్ కంపెనీ నుంచి మార్కెట్ లోకి వచ్చిన ఈ కొత్త లాప్టాప్ డిస్ప్లే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 60 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3000 nits బ్రైట్నెస్ తో యూజర్స్ కు అనుగుణంగా కాంతిని అందజేస్తుంది. అలాగే 45% NTSC కలర్ గాముట్ అందిస్తుంది. ఇది న్యూమరిక్ కీప్యాడ్ ను కలిగి ఉంటుంది. దీంతో సౌకర్యవంతంగా టైప్ చేసుకోవచ్చు. అలాగే విండోస్ 11 హోమ్ తో పనిచేస్తుంది. దీనికి ప్లాస్టిక్ chasis, డ్యూయల్ స్పీకర్ వంటివి సౌకర్యవంతంగా ఉంటాయి.

ఈ లాప్టాప్ లో 41 Wh బ్యాటరీ సపోర్ట్ చేయనుంది. దీనికి 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గా ఉంటుంది. దీనికి యూఎస్బి 3.2 జెన్ వన్ 1 టైపు ఏ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, హెచ్డిఎంఐ 1.4 పోర్ట్ ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేసే ఇందులో విండోస్ హలో సపోర్ట్, ఆప్షన్ ఫింగర్ ప్రింట్స్ స్కానర్ కూడా పొందవచ్చు. డెల్ 15 లాప్టాప్ ను రూ.69,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular