IPL Season 17: ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా కోల్ కతా జట్టు(Kolkata Knight Riders) నిలిచింది.. 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకున్న ఆ జట్టు.. 10 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి విజేతగా ఆవిర్భవించింది. ఫలితంగా మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకున్న జట్టుగా నిలిచింది. అయితే ఈ ఐపీఎల్ 17వ(IPL 17) సీజన్ అభిమానుల అంచనాలకు మించి సాగింది. చివరికి క్రీడా విశ్లేషకుల అంచనాలు కూడా దారి తప్పాయి.. సీజన్ ప్రారంభంలో చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో జట్లు మాత్రమే ఫైనల్ వెళ్తాయని.. ట్రోఫీ కోసం పోరు చెన్నై, ముంబై జట్ల మధ్య జరుగుతుందని విశ్లేషకులు అంచనాలు వేశారు. అయితే వారి అంచనాలు ఏమాత్రం నిజం కాలేదు..
గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా, గుజరాత్ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈ సీజన్లో కోల్ కతా జట్టు విన్నర్ కాగా, హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad) రన్నరప్ తో సరిపెట్టుకుంది.. ఇక ఈ సీజన్లో అద్భుతమైన ఆటతీరుతో కోల్ కతా జట్టు ఆకట్టుకుంది.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, మధ్యలో ఫీల్డింగ్ లో ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.. ఫలితంగా లీగ్ దశలో కోల్ కతా నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ప్లే ఆఫ్ మ్యాచ్ లోనూ కోల్ కతా అదే ఒరవడి కొనసాగించింది. చివరికి ఫైనల్ మ్యాచ్ ను సైతం ఏకపక్షం చేసింది.
అద్భుతమైన కెప్టెన్సీ తో శ్రేయస్ అయ్యర్ కోల్ కతా జట్టును ముందుకు నడిపించాడు. ఫైనల్ మినహా హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ కూడా అభినందనలకు అర్హుడు. ఎందుకంటే గత ఏడాది హైదరాబాద్ పాయింట్లు పట్టికలో పదో స్థానంలో ఉంది. ఈసారి రన్నరప్ గా నిలిచింది. బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఐపిఎల్ సెకండ్ స్పెల్ లో రాణించిన తీరు అద్భుతం.. ఏకంగా ఆరు మ్యాచ్లు గెలిచి ఆ జట్టు రన్నరప్ దాకా వచ్చింది.. రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు రెండు సంవత్సరాలపాటు ఆటకు దూరమైనప్పటికీ… రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును దాదాపు ప్లే ఆఫ్ దశ వరకు తీసుకొచ్చాడు..
ఇక లక్నో గత సీజన్లో ప్లే ఆఫ్ దాకా రాగా.. ఈ సీజన్లో లీగ్ దశలోనే ఆ జట్టు చరిత్ర ముగిసింది. పంజాబ్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. గత ఏడాది రన్నరప్ గుజరాత్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గత సీజన్ విజేత చెన్నై జట్టు కూడా కొత్త కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ నాయకత్వంలో గ్రూప్ దశ వరకే పరిమితమైంది.. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే విరాట్ కోహ్లీ 741 రన్స్ చేసి.. ఆరెంజ్ క్యాప్స్ సొంతం చేసుకున్నాడు.. అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ గా పంజాబ్ ఆటగాడు హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. వీరికి ప్రైజ్ మనీ కింద చెరి 10 లక్షలు అందాయి. ఇక మిగతా ఆటగాళ్లలో భారీగా అంచనాలు ఉన్న వారంతా పెద్దగా రాణించలేకపోయారు. బౌలర్లు కూడా వికెట్లు తీయలేకపోయారు. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా సాగింది. గత విజేత గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా..కోల్ కతా 2014 తర్వాత సరికొత్త విజేతగా ఆవిర్భవించింది.
ఆటగాళ్లలోనూ భారీ అంచనాలు ఉన్న వారంతా పెద్దగా రాణించలేకపోయారు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారీగా అంచనాలు ఉన్న జానీ బెయిర్ స్టో, మార్క్రం, అబ్దుల్ సమద్, మాక్స్ వెల్, డికాక్, ఇతర ఆటగాళ్లు తేలిపోయారు. వీరి వద్ద నుంచి ఆయా జట్లు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తే.. ఆ స్థాయిలో ఆట ప్రదర్శించకుండా చేతులెత్తేశారు. అయితే వచ్చే సీజన్లో ఈ ఆటగాళ్లను ఆయా జట్లు రిటైన్ చేసుకుంటాయా.. లేకుంటే వదిలించుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. పంజాబ్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. ఆ జట్టు యాజమాన్యం సమూల మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గుజరాత్ జట్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటారని సమాచారం. లక్నో జట్టు యాజమాన్యం ఏకంగా సారధినే మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ సంచలనాలకు కారణమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హైదరాబాద్ ఫైనల్ దూసుకెళ్లింది. పర్వాలేదు ఆడుతుంది అనే స్థాయి నుంచి కోల్ కతా జట్టు కప్ దక్కించుకుంది..
KKR vs SRH: మీ ఆటల మన్నువడ.. ఇదేం బ్యాటింగ్ రా నాయనా?
Chandrakant Pandit: చంద్రకాంత్ పండిట్.. ఈ పేరు శానా ఏండ్లు కోల్ కతా యాదికి పెట్టుకుంటది.. ఎందుకంటే?