KKR vs SRH : కోల్”కథ” మార్చుకుంది అక్కడే.. హైదరా”బాధ”పడింది అందుకే..

అయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. ఇలా తప్పుల మీద తప్పులు చేసి హైదరాబాద్ ట్రోఫీని అందుకోలేకపోయింది.. వరుసగా మూడోసారి కూడా ఓడిపోయి..కోల్ కతా కు మూడోసారి ఐపీఎల్ దక్కేందుకు కారణమైంది.

Written By: NARESH, Updated On : May 27, 2024 2:08 pm

SRH Vs KKR Final 2024

Follow us on

KKR vs SRH : 2016లో డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ ఐపీఎల్ కప్ దక్కించుకుంది. బెంగళూరు పై విజయం సాధించి, రెండవసారి విజేతగా ఆవిర్భవించింది..కోల్ కతా 2012లో గౌతమ్ గంభీర్ నాయకత్వంలో తొలిసారి ఐపిఎల్ ట్రోఫీ దక్కించుకుంది. 2014లోనూ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో విజేతగా ఆవిర్భవించింది. అప్పటినుంచి ఇప్పటి దాకా కోల్ కతా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. కప్ సాధించలేకపోయింది.. కానీ ఈసారి కప్ దక్కించుకోవాలని అటు హైదరాబాద్, ఇటు కోల్ కతా భావించాయి. అయితే ఈ రెండు జట్లపై క్రీడా విశ్లేషకులకు పెద్దగా అంచనాలు లేవు. కొద్దో గొప్పో కోల్ కతా మీద మాజీ ఆటగాళ్లు ఎంతో కొంత అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ హైదరాబాద్ ఫైనల్ వచ్చింది.. ఫైనల్ కంటే ముందు లీగ్, క్వాలిఫైయర్ -1 మ్యాచ్లలో కోల్ కతా చేతిలో ఓడిపోయింది. ఇలాంటి స్థితిలో హైదరాబాద్ కచ్చితంగా కోల్ కతా తో జరిగే ఫైనల్ మ్యాచ్లో గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, అత్యంత పేలవమైన ఆట తీరును ప్రదర్శించి, 113 పరుగులకే హైదరాబాద్ ఆల్ అవుట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో.. ఫైనల్ మ్యాచ్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసి.. చెత్త జట్టుగా పేరు లిఖించుకుంది.

వాస్తవానికి ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తన లయన్ కోల్పోయింది. అంతకుముందు అక్కడ వర్షం కురవడంతో.. చెన్నై మైదానం పేస్ కు అనుకూలించడం మొదలుపెట్టింది. కానీ ఈ విషయాన్ని గుర్తించడంలో హైదరాబాద్ కెప్టెన్ విఫలమయ్యాడు. వర్షం కురవడం వల్ల మైదానం మందకొడిగా మారుతుందనే భ్రమలోనే ఉన్నాడు. ఫలితంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇది కోల్ కతా ఆటగాళ్లకు వరమైంది. స్టార్క్, వైభవ్ అరోరా, రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి వారు బౌలింగ్లో మెరుపులు మెరిపించారు. ఫలితంగా హైదరాబాద్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. అయ్యర్ తో పోల్చితే కమిన్స్ అనుభవం ఉన్న ఆటగాడు. పైగా ఆస్ట్రేలియా జట్టుకు వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీలు అందించాడు. అంతటి అనుభవం ఉన్నప్పటికీ మైదానం స్థితిని అంచనా వేయలేక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అది హైదరాబాద్ జట్టుకు శాపం లాగా మారింది.. ఇదే సమయంలో ఆయాచితంగా లభించిన వరాన్ని కోల్ కతా బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు.

మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ వికెట్ల మీద వికెట్లు తీశారు. ఒకానొక దశలో హైదరాబాద్ జట్టు 90 పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, కిందా మీదా పడి 113 పరుగులు చేసింది.. బౌలింగ్లో, ఫీల్డింగ్లో సరికొత్తగా రాణించి, కోల్ కతా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ తలతిక్క నిర్ణయం తీసుకొని బ్యాటింగ్ ఎంచుకుంటే.. వచ్చిన అవకాశాన్ని సద్విని చేసుకుంది కోల్ కతా జట్టు. వాస్తవానికి కోల్ కతా బౌలర్ నైపుణ్యం ఏ స్థాయిలో ఉంటుందో హైదరాబాద్ జట్టుకు లీగ్, ప్లే ఆఫ్ మ్యాచ్లలో తెలిసిపోయింది. అయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. ఇలా తప్పుల మీద తప్పులు చేసి హైదరాబాద్ ట్రోఫీని అందుకోలేకపోయింది.. వరుసగా మూడోసారి కూడా ఓడిపోయి..కోల్ కతా కు మూడోసారి ఐపీఎల్ దక్కేందుకు కారణమైంది.