spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Punjab Kings: గత ఏడాది మిస్సయింది.. ఈసారి పంజాబ్ పంజా విసురుతుందా?

IPL 2026 Punjab Kings: గత ఏడాది మిస్సయింది.. ఈసారి పంజాబ్ పంజా విసురుతుందా?

IPL 2026 Punjab Kings: ఐపీఎల్ కు 18 సంవత్సరాల చరిత్ర ఉంది. రాజస్థాన్, ముంబై, కోల్ కతా, గుజరాత్, చెన్నై, బెంగళూరు జట్లు ట్రోఫీలను అందుకున్నాయి. కానీ ఇంతవరకు పంజాబ్ జట్టు ట్రోఫీ అందుకోలేదు. కొన్ని సందర్భాలలో ఫైనల్ వెళ్లినప్పటికీ.. పంజాబ్ జట్టును దురదృష్టం వెంటాడింది.

గత సీజన్లో పంజాబ్ జట్టు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఫైనల్ దాకా వెళ్ళింది. అయితే ఫైనల్ లో ఒత్తిడి ఎదుర్కోలేక బెంగళూరు చేతిలో భంగపాటుకు గురైంది. దీంతో ఈసారైనా పంజాబ్ జట్టు సత్తా చూపిస్తుందా.. ట్రోఫీని గెలుస్తుందా.. అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యర్ నాయకత్వంలో ఈసారి పంజాబ్ జట్టు సత్తా చూపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

2014, 2025 లో ఫైనల్ వెళ్ళింది.. అయితే రెండు సందర్భాల్లో కూడా పంజాబ్ జట్టుకు ఓటమి ఎదురైంది. పంజాబ్ జట్టును అయ్యర్ అద్భుతంగా ముందుండి నడిపించాడు. తనమీద మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా ముందుకు నడిచాడు. ఇక గత ఏడాది చివర్లో జరిగిన మెగా వేలంలో పంజాబ్ జట్టు కొంతమంది సమర్థవంతమైన ప్లేయర్లను తీసుకున్న నేపథ్యంలో.. ఈసారి ప్రత్యర్థి జట్లకు బలమైన పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

జట్టు బలం ఇదే

విదేశీ ప్లేయర్లు పంజాబ్ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నారు. ముఖ్యంగా మార్కో యాన్సన్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, కూపర్ కనోలి, అజ్మతుల్లా వంటి ప్లేయర్లు బీభత్సంగా బ్యాటింగ్ చేయగలరు. బంతిని కూడా అదే స్థాయిలో మెలికలు తిప్పగలరు. వీరంతా కూడా అంతర్జాతీయంగా అనేక లీగ్లలో ఆడుతున్నారు . మిగతా జట్లు స్వదేశీ ప్లేయర్లు నమ్ముకొని ఉంటే.. పంజాబ్ మాత్రం విదేశీ ప్లేయర్ల మీద భరోసా ఉంచింది. దీనికి తోడు లోకల్ ప్లేయర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. వీరు గనుక మరోసారి తమ సత్తా చూపిస్తే పంజాబ్ జట్టుకు తిరిగి ఉండదు. శ్రేయస్ అయ్యర్ సారధిగా ఉన్నాడు కాబట్టి.. అతడి నుంచి మెరుగైన ఇన్నింగ్స్ కచ్చితంగా నమోదు అవుతాయి. ఆ విషయంలో మేనేజ్మెంట్ గట్టి భరోసాతో ఉంది. ఫెర్గు సన్, చాహల్, యాన్సన్ వంటి వారితో బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. ఇక ఈ జట్టుకు అత్యంత పటిష్టమైన రిజర్వ్ బెంచ్ ఉంది.

Also Read: ఈసారి మిస్ కాదు.. ధోని ఎల్లో జెర్సీ వేసేది ఇదే చివరి సారి.. ఎందుకంటే?

ఇవి బలహీనతలు

ఈ జట్టులో పెద్దగా అనుభవం లేని ప్లేయర్లు ఉన్నారు. అది ఈ జట్టుకు ప్రధాన బలహీనత. ప్రియాంష్ ఆర్య, శశాంక్, వదేరా, హరి ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, వైషాక్ వంటి ప్లేయర్లకు ఐపీఎల్ అనుభవం చాలా తక్కువ. అయితే వీరిలో అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. ఐపీఎల్ లో అనే విషయంలో వీళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కీలక సమయాలలో వీరు తడబడ్డారు. అందువల్ల గత సీజన్లో పంజాబ్ జట్టు ఫైనల్ లో ఓటమిపాలైంది. ఇక ఈ జట్టులో చాహల్ మాత్రమే నాణ్యమైన స్పిన్నర్ గా ఉన్నాడు. స్పిన్ దళంలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

లోకల్ ప్లేయర్లు

విశాల్, శ్రేయస్ అయ్యర్, ప్రవీణ్, అవినాష్, హర్నూర్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్, నెహల్ వదెరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ, అర్ష్ దీప్ సింగ్, చాహల్, హర్ ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, సూర్యన్, విష్ణు వినోద్.

ఫారిన్ ప్లేయర్లు

బెన్ డ్వారూయిష్, స్టోయినిస్, యాన్సన్, అజ్మతుల్లా ఓమర్ జాయ్, జేవియర్ బార్ట్ లెట్, ఓవెన్, ఫెర్గు సన్, కూపర్ కన్నోలీ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper