IPL 2025
IPL 2025 : కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు బలంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు జట్ల నుంచి హోరాహోరి ప్రదర్శన ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండుసార్లు పోటీపడ్డాయి. రెండుసార్లు కూడా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సొంతం చేసుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ కు అజింక్యా రహానే సారథ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. ఆ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. గత ఏడాది జరిగిన మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇక కోల్ కతా జట్టుకు అజింక్యా రహానే నాయకత్వం వహిస్తున్నాడు. బెంగళూరు జట్టుకు గత సీజన్లో డూ ప్లెసిస్ నాయకత్వం వహించాడు. ఈ సీజన్లో రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నాడు..
Also Read : KKR vs RCB.. కోల్ కతా, బెంగళూరు గత రికార్డులు, బలాబలాలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే.
టాప్ వీరే..
ఇక ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనలు కొనసాగుతుంటాయి. ఆటగాళ్లు సరికొత్త విన్యాసాలతో ఆకట్టుకుంటారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 17 ఎడిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇందులో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడు ఏకంగా 8004 పరుగులు సాధించాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా యజు వేంద్ర చాహల్ కొనసాగుతున్నాడు. అతడు 205 వికెట్లు పడగొట్టాడు.. ముంబై జట్టు, చెన్నై జట్టు ఐదుసార్లు విజేతలుగా నిలిచాయి. ఇప్పటివరకు ఐపీఎల్ లో 17 ఎడిషన్లు పూర్తికాగా.. ఈ రెండు జట్లు పదిసార్లు విజేతలుగా నిలవడం విశేషం. ఇక శిఖర్ ధావన్ అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. శిఖర్ ధావన్ 768 ఫోర్లు కొట్టాడు. అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా ఏబి డివిలియర్స్ నిలిచాడు. డివిలియర్స్ ఇప్పటివరకు 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇక హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోర్ చేసిన టీం గా రికార్డు సృష్టించింది. గత ఏడాది బెంగళూరు పై మూడు వికెట్ల నష్టానికి హైదరాబాద్ జట్టు 287 పరుగులు చేసింది. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతడు ఏకంగా 8 సెంచరీలు చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్ 66 హాఫ్ సెంచరీలు చేశాడు. మరి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్ జట్టు ఈసారి ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి.
Also Read : మండే ఎండల్లో.. మస్తు క్రికెట్ మజా..