Nithin , Keerthy Suresh
Nithin and Keerthy Suresh : బలగం చిత్రం దర్శకుడు వేణు(Venu Yeldandi), దిల్ రాజు(Dil Raju) నిర్మాణం లో హీరో నితిన్(Nithin) తో కలిసి ‘ఎల్లమ్మ’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో చేద్దామని అనుకున్నారు , స్టోరీ ని కూడా ఆయనకు వినిపించారు, కానీ ఎందుకో తెలియదు కానీ ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ చిత్రం నితిన్ చేతుల్లోకి వెళ్ళింది. హీరోయిన్ గా సాయి పల్లవి(Sai Pallavi) దాదాపుగా ఖరారు అయ్యింది. కానీ డేట్స్ క్లాష్ రావడం వల్ల ఆమె ఈ చిత్రానికి కావాల్సినన్ని డేట్స్ సర్దుబాటు చేయలేక తప్పుకుంది. ఇప్పుడు ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్(Keerthy Suresh) నటించబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. గతం లో నితిన్ కీర్తి సురేష్ తో కలిసి ‘రంగ్ దే’ అనే చిత్రం చేసాడు.
Also Read : డైరెక్టర్,నేను నిన్న రాత్రి కామించుకోబోయాము అంటూ హీరో నితిన్ బోల్డ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!
ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, టీవీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. నితిన్, కీర్తి సురేష్ జోడి కి కూడా మంచి మార్కులే పడ్డాయి. మళ్ళీ అదే కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందట. కచ్చితంగా అద్భుతంగా నటించే కెపాసిటీ ఉన్న హీరోయిన్స్ కోసమే డైరెక్టర్ వేణు ఇన్ని రోజులు వెతికాడు. సమంత, అనుష్క రేంజ్ హీరోయిన్స్ ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. కానీ దిల్ రాజు సూచనతో కీర్తి సురేష్ ని ఎంచుకున్నాడు. ఆమెకు వెళ్లి ఈ సినిమా స్టోరీ చెప్పగానే ఎంతో సంతోషించిందట. మహానటి తర్వాత కీర్తి సురేష్ కి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పెద్దగా దొరకలేదు.
‘సర్కార్ వారి పాట’, ‘దసరా’ చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ దొరికాయి కానీ, అవి కీర్తి సురేష్ టాలెంట్ కి సరిపడ క్యారెక్టర్స్ కావు అనే చెప్పాలి. కానీ ఎల్లమ్మ మాత్రం ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ రోల్ గా నిల్చిపోతుందట. ఆమె పర్ఫెక్ట్ గా ఈ సినిమాలో నటిస్తే మరో నేషనల్ అవార్డుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం కీర్తి సురేష్ మాత్రమే కాదు, హీరో నితిన్ కి కూడా నటుడిగా ఈ సినిమా పెద్ద సవాల్ అట. వీళ్లిద్దరు ఎంత అద్భుతంగా నటిస్తే, అంత రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ప్రస్తుతం నితిన్ హీరో గా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ చిత్రం తర్వాత ఆయన తమ్ముడు అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. మే నెల నుండి ఆయన ‘ఎల్లమ్మ’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
Also Read : కీర్తి సురేష్ నుండి డబ్బులు లాక్కున్న ఐస్ క్రీం షాప్ ఓనర్..వీడియో వైరల్!