IPL 2025 Opening ceremonies
IPL Trophy 2025 : ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) పోటీ పడుతున్నాయి.. గత సీజన్లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు కూడా కోల్ కతా గెలుపును సొంతం చేసుకుంది.. అయితే ఈసారి కోల్ కతా పై రివెంజ్ తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది.కోల్ కతా జట్టు కు సొంత ప్రేక్షకుల మద్దతు ఉండడంతో కాస్త అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.. ఇక గత సీజన్లోనూ డిపెండింగ్ ఛాంపియన్ గా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. ఆ మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది.. ఇక ఈ సీజన్లోనూ బెంగళూరు ప్రారంభ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రారంభ వేడుకలు జరుగుతాయి.
Also Read : ఐపీఎల్ కు తగ్గిన క్రేజ్.. టికెట్లు అలానే మిగిలిపోయాయి..
దిశా పటాని, శ్రేయ ఘోషల్ తో సాంస్కృతిక ప్రదర్శనలు..
ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వాహక కమిటీ ఘనంగా నిర్వహిస్తుంది. 18వ ఎడిషన్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి బీసీసీఐ పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ప్రారంభ వేడుకల్లో అభిమానులను అలరించడానికి దిశాపటాని(Disha patani), శ్రేయ ఘోషల్(Shreya Ghoshal) వంటి వారు సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రమే కాకుండా షారుక్ ఖాన్(Shahrukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan) వంటి బాలీవుడ్ పెద్ద స్టార్లు ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చావా సినిమాతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) ఐపీఎల్ ఆరంభ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) కూడా ప్రారంభ వేడుకల్లో కనిపిస్తాడు. శ్రద్ధ కపూర్(Shraddha Kapoo, కరీనాకపూర్(Kareena Kapoor), మాధురి దీక్షిత్(Madhuri Dixit) కూడా ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో మెరుస్తారు.. దిశా పటాని తన డ్యాన్సులతో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తుందని ఐపీఎల్ నిర్వాహక కమిటీ సభ్యులు చెబుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో డ్యాన్స్ చేసినందుకు గానూ దిశాపటానికి కోటి వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే దీనిపై అటు ఐపీఎల్ నిర్వాహక కమిటీ సభ్యులు.. దిశా పటాని(Disha patani) అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. శ్రేయ ఘోషల్(Shreya Ghoshal) కు 50 లక్షల దాకా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మిగతా బాలీవుడ్ నటులు, నటి మణులకు కూడా కళ్ళు చెదిరిపోయే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. మొత్తంగా రిచ్ క్రికెట్ లీగ్ గా పేరుపొందిన ఐపీఎల్ ను అదే స్థాయిలో నిర్వహించడానికి నిర్వాహక కమిటీ భారీగా ఏర్పాట్లు చేసింది.
Also Read : మూడు ముక్కల్లో ఐపీఎల్ గురించి కెప్టెన్లు చెప్పేశారు!
Presenting the glittering trophy
Let the #TATAIPL 2025 show begin pic.twitter.com/aLrl4abLfT
— IndianPremierLeague (@IPL) March 22, 2025