Ananya Nagalla
Ananya Nagalla : బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ నిర్వహించిన వారిలో సినీనటి అనన్య నాగళ్ళ(Telugu cinema actress Ananya nagalla) కూడా ఉన్నారు. ఆమె వకీల్ సాబ్ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. మల్లేశం అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతున్నారు. ఐటీ ఉద్యోగం నుంచి సినిమా ఫీల్డ్ వైపు వచ్చిన అనన్య.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి.. ఇక్కడే ఐటి ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత సినిమా రంగం వైపు వచ్చారు. వకీల్ సాబ్ సినిమాలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకున్నది. ఆమధ్య ప్రముఖ జర్నలిస్టు మూర్తి తో ఓ సినిమాలో కూడా నటించింది. అయితే ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు . ఇక సోషల్ మీడియాలోనూ అనన్య కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెను లక్షల మంది అనుసరిస్తుంటారు.
Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని మాకెలా తెలుస్తుంది?- అనన్య నాగేళ్ల
అనన్యతో గతంలో ఓ సినిమా చేయడంతో ప్రముఖ జర్నలిస్టు మూర్తి.. ఆమెను డిబేట్ కు ఆహ్వానించాడు. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో అనన్య ప్రైమ్ టైం డిబేట్ కు హాజరు కావడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో మూర్తి అనన్యను సంబోధిస్తూ.. ” ఏం పోయే కాలం ఇది.. నీ పేరు ఇందులో ఎందుకు రావాలి అనన్య” అంటూ వ్యాఖ్యానించాడు.. మూర్తి చేసిన ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో ప్రకంనలు సృష్టిస్తోంది. మూర్తి చేసిన ఆ వ్యాఖ్యకు అనన్య సానుకూలంగానే స్పందించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన చర్చ జరుగుతుంది. అనన్య మాత్రమే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయలేదని.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా చేశారని.. అనన్య ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిల దొక్కుకుంటున్నదని.. ప్రకాష్ రాజ్ దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్నారని.. అయినప్పటికీ ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేశారని.. ఆయనను కూడా మూర్తి ఇలాగే ప్రశ్నిస్తారా అంటూ నెటిజన్లు అంటున్నారు.. బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేయడం తప్పే అయినప్పటికీ.. సినిమా ఫీల్డ్ లో అవకాశాలు లేకపోతే ఏదో ఒక ఆదాయం మార్గం చూసుకోవాలని.. అనన్య కూడా అలానే చూసుకుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. మూర్తి కొందరి విషయంలో ఒకలాగా.. ఇంకొందరు విషయంలో ఇంకోలాగా వ్యవహరించకూడదని హితవు పలుకుతున్నారు. అనన్యతో సినిమా చేసినంతమాత్రాన పబ్లిక్ డొమైన్ లో అలా వ్యాఖ్యానించకూడదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : తెలంగాణ హై కోర్టుకు యాంకర్ శ్యామల.. ఈ ట్విస్ట్ ఊహించలేదు!
Herione @AnanyaNagalla Reacts On Betting Promotions –
Big News – #TV5 News #TV5Murthy #HerioneAnanyaNagalla #bignews #TV5News #Ananyanagalla pic.twitter.com/rzgQLlO0FC
— Murthy Journalist (@murthyscribe) March 21, 2025